Author: Admin

-కాంగ్రెస్ డిక్లరేషన్ తో కంగుతిన్న కేసీఆర్-హస్తం హామీలపై స్పందించేందుకు మల్లగుల్లాలు డిక్లరేషన్ పై మాట్లాడకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం-పొలిటికల్ టూరిస్టులు అంటూ అవాకులు, చెవాకులుకేసీఆర్ మౌనంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ తెలంగాణలో రైతుల్ని బ్రహ్మాండంగా ఉద్ధరించామని, ఇక దేశంలో రైతుల్ని ఆదుకునే దిక్కు ఒక్క టీఆర్ఎస్సేనని, దేశ రాజకీయాల్ని దున్నేస్తానంటూ నాగలి పట్టుకుని బయల్దేరుతున్న కేసీఆర్… నేల విడిచి సాము చేస్తున్నారు. వాస్తవాల్ని కనుమరుగు చేస్తూ… జాతీయ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రశాంత్ కిశోర్ ఐడియాల మేరకు ఇతర రాష్ట్రాల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా 2014లో మోడీకి ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ఐడియా కూడా అదే కదా. కానీ.. కేసీఆర్ నిజంగా రైతు బంధువా…? వరి వేస్తే ఉరే అన్నడు. బీజేపీతో పంచాయితీ పెట్టుకుని అది రైతుల సమస్య అని మభ్యపెట్టలేదా..? కేసీఆర్ తో పంచాయితీ పెట్టుకున్న బీజేపీ రైతుల్ని బలి తీసుకోలేదా…?…

Read More

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో పర్యటించిన రాహుల్ గాంధీ గారినీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కో ఆర్డినేటర్ డా. సి. రోహిన్ రెడ్డి. వరంగల్ లో రైతు సంఘర్షణ సభ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన రాహుల్ గాంధీ గారికి వందలాది మంది కార్యకర్తలతో రోహిన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తాను పోటీ చేయాలని ఆశిస్తోన్న ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని హోటల్ తాజ్ కృష్ణలో రాహుల్ బస చేయగా.. వారి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. శనివారం తాజ్ కృష్ణ నుంచి సంజీవయ్య పార్క్ కి రాహుల్ బయలుదేరగా.. వారి వెంట వెంట రోహిన్ రెడ్డి భారీసంఖ్యలో కార్యకర్తలతో తరలివెళ్లారు. ఈ దారిలో బుల్లెట్ ర్యాలీ అందరినీ ఆకర్షించింది, అక్కడి నుంచి గన్ పార్క్ అమరవీరుల స్థూపం మీదుగా గాంధీభవన్ వరకు జై కాంగ్రెస్,…

Read More

సురభీ గౌతమ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలని పదో తరగతిలోనే నిర్ణయించుకుంది. మధ్య ప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన, కుగ్రామం నుండి వచ్చిన ఆ అమ్మాయి తన కలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడింది. ఇంగ్లీష్‌ మాట్లాడలేక అవమానపడింది. చివరకు అనుకున్నది సాధించింది. ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ప్రయాణం గురించి మరిన్ని విశేషాలు… ‘ఆరో తరగతి లెక్కల పరీక్షలో వందకు వంద మార్కులు సాధించాను. అప్పుడే క్లాసులో నాకంటూ ఓ గుర్తింపు, ప్రోత్సాహం లభించింది. ఎంత శ్రమిస్తే అంత గుర్తింపు వస్తుందని అప్పుడే నాకు అర్థమయింది” అంటూ తన స్కూలు చదువును గుర్తు చేసుకుంది సురభి. పదో తరగతిలో లెక్కలు, సైన్స్‌లో వందకు వంద మార్కులను సాధించింది. ఈ విజయం ఆమెకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. తన కలను నేరవేర్చుకోవడానికి ఈ విజయాన్ని ఓ మార్గంగా భావించింది.బాధ్యతగా భావించిప్రస్తుతం ఓ మనిషి బతకాలంటే కనీసం వైద్యం, విద్యుత్‌ ఉండాలి.…

Read More

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం: రేవంత్‌ తెలంగాణ అంటే మాకు ఆత్మగౌరవం: రేవంత్‌రెడ్డి రైతుల కుటుంబాలను కేసీఆర్‌ ఛిన్నాభిన్నం చేశారు: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం: రేవంత్‌ ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తాం: రేవంత్‌ రెడ్డి భూమిలేని కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.12వేలు సాయం చేస్తాం అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: రేవంత్‌ రెడ్డి రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొంటుంది పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకుంటాం పంటల బీమా పథకం అమలు చేసి.. నష్టపరిహారం వెంటనే అందజేస్తాం కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ రద్దు: రేవంత్‌ రెడ్డి పోడు రైతులకు పట్టాలు ఇస్తాం: రేవంత్‌ రెడ్డి పెండింగ్‌ ప్రాజెక్టులను అన్నింటిని పూర్తి చేస్తాం: రేవంత్ రెడ్డి చట్టపరంగా రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం:…

Read More

ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ – ధరణి పోర్టల్ రద్దు రాహుల్ గాంధీ సాక్షిగా రైతు డిక్లరేషన్ ప్రకటన365 రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్భూమిలేని రైతులకి పెట్టుబడి సహాయంపంట గిట్టుబాటు ధరల ప్రకటనకేసీఆర్ వ్యవసాయాన్ని చిన్నాభిన్నం చేశారురైతు సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 365 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఆ వెంటనే రాష్ట్రంలో రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ ను రద్దు చేసి.. భూమి కలిగిన ప్రతి పేదవాడికి న్యాయం చేసేలా నూతన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని అన్నారు. ఈ మేరకు వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ వేదికగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ను ప్రకటించారు. రైతుని రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని..…

Read More

ప్రజలు టీఆర్‌ఎస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు: రాహుల్‌గాంధీరెండుసార్లు అవకాశమిచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రజల కోరిక నెరవేర్చలేదు:వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలి: రాహుల్‌గాంధీతెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌ తప్పక నెరవేరుస్తుంది: రాహుల్ తెరాస, భాజపా మధ్య ఒప్పందం ఉంది: రాహుల్‌గాంధీమోదీ ప్రభుత్వానికి టీఆర్‌ఎస్‌ సహకరిస్తోంది: రాహుల్‌గాంధీమోదీ 3 నల్ల చట్టాలను తీసుకొస్తే టీఆర్‌ఎస్‌ సహకరించింది: రాహుల్‌తెలంగాణలో సొంతంగా గెలవలేమని భాజపాకు తెలుసు: రాహుల్‌గాంధీకాంగ్రెస్‌, భాజపా కలవదని ఆ పార్టీ నేతలకు తెలుసు: రాహుల్కాంగ్రెస్‌ ఎప్పటికీ కలవదని.. టీఆర్‌ఎస్‌తో కలుస్తారు: రాహుల్‌తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండాలని భాజపా భావిస్తోందిటీఆర్‌ఎస్‌ రిమోట్‌ భాజపా చేతిలో ఉంది: రాహుల్‌గాంధీ

Read More

హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు సంఘర్షణ సభ అట్టహాసంగా జరుగుతోంది. రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్‌ శ్రేణులు, రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. సభ ప్రధాన వేదికకు ఎదురుగా రెండు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యుల కోసం ఒక వేదిక కేటాయించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో మాట్లాడిన రాహుల్… వారిని పరామర్శించారు. కన్నీరు తుడిచి… అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాహుల్ వెంట ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… రైతుల సమస్యల్ని వివరించారు.

Read More

వినండి కవితగారూ… రాహుల్ ఎందుకు రావాలో చెబుతాం..! కవిత ప్రశ్న: గౌరవ రాహుల్ గాంధీ గారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి.? జవాబు: దేశంలో మోదీ నియంతృత్వాన్ని, బీజేపీ నేతల అసహనాన్ని ప్రశ్నిస్తున్న లీడర్ రాహుల్. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై గళమెత్తుతున్న ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణకు జాతీయ రహదారుల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని లోక్‌సభలో రేవంత్ ప్రశ్నించారు. మీకు తెలియదా..? వినండి కవితగారూ… రాహుల్ ఎందుకు రావాలో చెబుతాం..! కవిత ప్రశ్న: తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు..? జవాబు: తెలంగాణ ప్రజల హక్కులు గుర్తించి, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు అంశం దగ్గర నుంచి కశ్మీర్ జనాల కష్టాల వరకు లోక్‌సభలో మాట్లాడారు. మీరేమో తెలంగాణ హక్కుల కోసం పని…

Read More

AICC మాజి ప్రెసిడెంట్ శ్రీ రాహుల్ గాంధీ గారి వరంగల్ పర్యటన తేది: 06-05-2022న ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ ఆవరణలో జరుగనున్న రైతు సంఘర్షణ సభ సందర్భంగా పట్టణము నందు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడినవి. హైదరాబాద్ నుండి వరంగల్ వచ్చు వాహనాలు పెద్దపెండ్యాల ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఉనికిచెర్ల, వడ్డేపల్లి చర్చ్, ఎన్జీవోస్ కాలనీ మీదు చేరుకోవాల్సి ఉంటుంది. బహిరంగ సభకు హైదరాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలు ఫాతిమా (మదర్ థెరిస్సా) జంక్షన్ వద్ద ప్రజలను దించి తిరిగి మడికొండ వైపుగా ఈనాడు ఆఫీసు ఎదురుగావున్న పార్కింగ్ స్థలంలో తమ వాహనాలు నిలుపుకోవలయును. ఖమ్మం, మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలు నాయుడు పెట్రోల్పంపు, ఉర్సుగుట్ట, హంటర్ రోడ్డు మీదుగా నీలిమ జంక్షన్ (విష్ణుప్రియ గార్డెన్స్) వద్ద ప్రజలను దించి ప్రకాశ్ రెడ్డిపేట పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలుపుకోవలయును. అక్కడ పార్కింగ్…

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగురుద్ది -రాహుల్ రైతు సంఘర్షణ సభ సభతో సునామీ సృష్టిస్తాం..-టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం..-రైతుల జీవితాలతో టీఆర్ఎస్, బీజేపీ చెలగాటం..-వడ్ల కొనుగోలుపై డ్రామాలు ఆడుతున కేసీఆర్..-నాగార్జునసాగర్ సభలో నిప్పులు చెరిగిన రేవంత్.. వరంగల్ లో మే 6న జరగనున్న రాహుల్ గాంధీ “రైతు సంఘర్షణ సభ” ద్వారా కాంగ్రెస్ రైతు సునామీని సృష్టిస్తుందని.. ఆ సునామీలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీల బాగోతాలను వివరించి, రైతుల ముందు దోషులుగా నిలబెడతామని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ లో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా .. రైతు సంఘర్షణ సభ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై.. కార్యకర్తలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి…

Read More