కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో పర్యటించిన రాహుల్ గాంధీ గారినీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కో ఆర్డినేటర్ డా. సి. రోహిన్ రెడ్డి.
![](https://polytricks.in/wp-content/uploads/2022/05/effd3b2e-15b5-409b-becc-aeb92bac49ab.jpg)
వరంగల్ లో రైతు సంఘర్షణ సభ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన రాహుల్ గాంధీ గారికి వందలాది మంది కార్యకర్తలతో రోహిన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తాను పోటీ చేయాలని ఆశిస్తోన్న ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని హోటల్ తాజ్ కృష్ణలో రాహుల్ బస చేయగా.. వారి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. శనివారం తాజ్ కృష్ణ నుంచి సంజీవయ్య పార్క్ కి రాహుల్ బయలుదేరగా..
![](https://polytricks.in/wp-content/uploads/2022/05/5ea7a048-93d5-4fd8-b88a-687dc0dedbb5-768x1024.jpg)
వారి వెంట వెంట రోహిన్ రెడ్డి భారీసంఖ్యలో కార్యకర్తలతో తరలివెళ్లారు. ఈ దారిలో బుల్లెట్ ర్యాలీ అందరినీ ఆకర్షించింది, అక్కడి నుంచి గన్ పార్క్ అమరవీరుల స్థూపం మీదుగా గాంధీభవన్ వరకు జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ జిందాబాద్ నినాదాలతో వెళ్లారు. ఈ మొత్తం కార్యక్రమాల అమలులో రోహిన్ రెడ్డి కీలకంగా
![](https://polytricks.in/wp-content/uploads/2022/05/98567559-9c78-444b-a2a3-8c2a913cd106.jpg)
వ్యవహరించారు.అనంతరం గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహకులు సమావేశంలో రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ తో కాసేపు ముచ్చటించి.. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరపున చేస్తున్న కార్యక్రమాలను, ప్రజలకు అందుబాటులో ఉంటోన్న తీరుని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని గారిని కలవడం,
![](https://polytricks.in/wp-content/uploads/2022/05/3710d77c-98d2-4f60-85fd-fecf3ab62f46-1-1024x768.jpg)
వారి పర్యటన ఆసాంతం కీలకంగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉందని డా. సి. రోహిన్ రెడ్డి తెలిపారు. ఈ ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మరింత జోష్ తో పనిచేస్తామని అన్నారు.