ఏ రంగంలోనైనా వీకెండ్స్, పండగలకు సెలవులు ప్రకటించడం సాదారణమే. ఇందుకు బ్యాంకులు మినహాయింపు ఏమి కావు. కాని ఏకంగా ఏప్రిల్ లో బ్యాంకులు 15రోజులు మూతబడనున్నాయి. వచ్చే నెలలో 15 రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. కాబట్టి బ్యాంకు పనులను ముందుగానే ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగించుకోవాలని బ్యాంకు అధికారులు ప్రజలకు సూచించారు. కింద ఇచ్చిన లిస్ట్ లో సెలవు దినాలు మినహా బ్యాంకు సేవలు అందుబాటులో వుంటాయి.
ఏప్రిల్ నెలలో బ్యాంకుల సెలవు దినాలు…
- ఏప్రిల్ 1: కొత్త ఆర్థికసంవత్సరం తొలి రోజు ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవుగా ప్రకటించారు.
- ఏప్రిల్ 2, 9, 16, 23, 30, ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
- మహావీర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 4న వివిధ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
- ఏప్రిల్ 5 బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో బ్యాంకులకు సెలవు.
- ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- ఏప్రిల్ 8 రెండో శనివారం, 22 నాలుగో శనివారం కావడంతో ఆ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
- ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
- ఏప్రిల్ 15న వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగలు జరుపుకుంటారు. కాబట్టి..ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.
- షాబ్ ఇ బకర్ కారణంగా ఏప్రిల్ 18న జుమ్మూ అండ్ శ్రీనగర్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
- ఈద్ ఉల్ ఫితర్తో ఏప్రిల్ 21న అగర్తల, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.