Q:- రేవంత్ రెడ్డి ఎంపీ గా ఉండి ghmc ల ఎన్ని సీట్లు గెలిపించిండు?
Ans:- నీ సొంత ఊర్ల సర్పంచ్ ను గెల్పించుకున్నవా! నీ అన్నని జెడ్పీటీసీ గ గెల్పించుకున్నవా?
Q:- రేవంత్ రెడ్డి బ్లాక్ మేయలర్!
Ans:- నీకొచ్చిన కాంట్రాక్టును టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు కమీషన్లకు అమ్ముకున్నది నిజం కాదా! నెల కింద నువ్వు పొయ్యి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ను ఎందుకు కలిసినట్టు..??
Q:- రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎడ ఉన్నడు, ఎక్కడా పాల్గొనలేదు..!
Ans:- సీమాంధ్ర ముఖ్యమంత్రిపై అసెంబ్లీల గర్జించిన మాటలు ఇంకా అట్లనే ఉన్నయి.. నువ్వన్నటే చెయ్యలేదు అనుకుందాం, మరి ఆరోజు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒకటికి నాలుగసార్లు ఎందుకు ఆహ్వానించినట్టు..!!
Q:- కాంగ్రెస్ పార్టీ కోసం నేను రాజ్ న్యూస్ పెట్టిన..
Ans:- పెట్టినవ్ కరెక్టే, నువ్వు కాంగ్రెస్ లనే ఉండి బీజేపీ కి అమ్ముకున్నవ్ కదా!!
Q:- రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నడు, పార్టీనీ అమ్ముకుంటున్నడు… పార్టీని నడిపిస్తున్నది వాళ్ళే..!
Ans:- చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పోత్తు లో అత్యధిక స్థానాలు గెలిచినమ్! ఆరోజు ఛైర్మన్ పదవి బీజేపీ నుండి గెలిచిన కౌన్సిలర్ కు అర్రాస్ పెట్టినవా లేదా?
నువ్వు బీజేపీ కి అర్రాస్ పెట్టినవ్ అనే కదా కమ్యూనిస్టులు పొత్తు విరమించుకొని టీఆర్ఎస్ జంప్ అయినరు..?
Media:- కాంట్రాక్టు కోసమే మీరు పార్టీ మారుతున్నరు అనే ఆరోపణ మీ పై ఉంది..!
Q:- నేను బీజేపీ కి పోతా అని 2019 నుండి చెప్తున్న, నాకు కాంట్రాక్ట్ వచ్చింది 2022 మార్చ్ లో, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు..
Ans:- ఆరోజు నుండి జోక్తున్నవ్ కాబట్టే ఈరోజు ఇచ్చినరు అని ఎందుకు అనుకోవద్దు??
Q:- చెరుకు సుధాకర్ ను పార్టీల ఎట్ల చేర్చుకుంటవ్?
Ans:- ఆయన నిఖార్సైన ఉద్యమకారుడు కాదా? ఉద్యమకారులు కాంగ్రెస్ లో లేరని నువ్వే అంటివి, ఈరోజు వచ్చేవారిని ఎందుకు ఆపుతున్నవ్??