అవును. మీరు చదివింది కరక్టే. బిజెపి బ్లాకు దందాలోనే కాదు – వైట్ దందాలో కూడా నెంబర్ వన్. ఎలా అంటారా? అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడిఆర్) 2021 – 2022 ఏడాదికి గాను మన దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలు ప్రకటించింది. ఇందులో మొదటి స్థానంలో బిజెపి ఉంది. గత ఏడాది ఆ పార్టీకి అందిన విరాళాలు రూ. 614.53 కోట్లు. మిగతా పార్టిలు దరిదాపుల్లో కూడా లేదు. ఏ పార్టీ కూడా రెండో అంకెను దాటలేదు.
ఇవి కేవలం పైకి కనిపించే వైట్ మని. వీటికి లెక్కలు – పత్రాలు ఉంటాయి. కానీ లెక్కలు – పత్రాలు లేకుండా బ్లాకులో బిజెపికి వచ్చే విరాళాలు వేరు. దేశంలోని దాదాపు వందకు పైగా కార్పోరేట్ కంపెనిలనుంచి వచ్చే విరాళాలు వస్తాయి. ‘హఫ్తా వసూల్’ అనబడే వీటిని అందంగా ‘విరాళాలు’ అనే ట్యాగ్ లైన్ పెడతారు. ఇందులో విజయ్ మాల్య గ్రూప్ , నిరవ్ మోడీ గ్రూప్ , గౌతమ్ అదాని గ్రూప్, రిలయన్స్ గ్రూప్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వీళ్ళు నేరుగా బిజెపి అకౌంట్ లోకి డబ్బులు వేయరు. ఎంపిలు లేదా ఎమ్మెల్యేలు ఎన్నికలలో పోటి చేసేటప్పుడు, లేదా ఎంపిలను లేదా ఎమ్మెల్యేలను గంప గుత్తగా కొనేటప్పుడు ఆ ఖర్చులను వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. అంతే కాకుండా ప్రతి నెలా సాదారణ ముడుపులు ఒక క్రమ పద్దతిలో స్విస్ బ్యాంక్లో డబ్బు జమచేస్తారు. అధికారంలో ఉన్న పార్టీలకు వద్దంటే విరాళాలు వస్తాయి. అది ఏమి ఆశించి వస్తాయో తెలిసిందే. వాళ్లు చేయించుకునే పనులు ఏమిటో తెలుసు. మన దేశంలో అధికారంలో ఉన్న ఒక ఎంపి కి ఏడాదికి సగటున రూ. 2000 నుంచి రూ 45౦౦౦ కోట్లు ముడుపులు అందుతున్నాయి ఆ సంస్థ అనదికారికంగా చెబుతుంది.
కాంగ్రెస్ పార్టీకి రెండో స్థానంలో రూ. 95.46 కోట్ల విరాళాలు మాత్రమే వచ్చాయి. అంటే బిజెపి కంటే అరింతలు తక్కువ. తర్వాత రూ. 44.54 కోట్ల విరాళాలతో ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్ కు 43లక్షలు… సీపీఎం పార్టీకి 10 కోట్లు విరాళాలు వచ్చాయి. ఎన్నికల నియామవళి ప్రకారంగా 20 వేల కంటే ఎక్కువ విరాళాలు వస్తే ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. కానీ దానిని ఎవరు పాటిస్తారు?
అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు కూడా కోట్లల్లో విరాళాలు వస్తున్నాయి. ఒకవేళ విరాళాలు రాకపోతే ఆ పార్టీ నాయకులే తమ కార్యకర్తలతో బ్యాంకులో విరాళాలు వేయిస్తారు. ఎందుకంటే 90 రూపాయలు బ్లాకు మని ఖర్చు చేసినా 10 రూపాయలైనా నామ్కే వాస్తుగా ఎన్నికల కమిషన్ కి చుపాలిగా.