మయోసైటిస్ వ్యాదిన బారిన పడిన సమంత ఇటీవల కోలుకుంది. ఇదివరకు తాను అంగీకరించిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకుగాను షూటింగ్ లో బిజీ అయిపొయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న ‘సీటా డెల్’ అనే చిత్ర షూటింగ్ లో పాల్గొంటుంది సామ్. గతంలోనూ అమెజాన్ ప్రైమ్ తెరకెక్కించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో విలన్ గా నటించి మెప్పించింది.
ఈ సీరిస్ మంచి టాక్ అందుకోవడంతో సమంతకు ఆఫర్లు బాగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన‘సీటా డెల్’ ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తుంది. ఈ మధ్యే ఆమె కోలుకోవడంతో చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
‘సీటా డెల్’ సీరిస్కు సంబంధించి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా సమంతకు గాయలైనట్లు తన ఇన్స్టాలో ఫోటో షేర్ చేసి పేర్కొంది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు సమాచారం. రక్తపు మరకలతో నిండిన ఆమె ఆమె చేతులను చూసి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు సమంతకే వరుసపెట్టి అపాయాలు జరుగుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా చేతికైనా గాయం త్వరగా మానాలని కోరుతున్నారు. ఈ సినిమాలో హీరో గా వరుణ్ ధావన్ చేస్తున్నాడు.
హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా రోల్ ను ఇందులో సమంత చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తనకి ఎంత మంచి పేరు తెచ్చిందో, అంతకు మించి ప్రఖ్యాతలు ఈ సిరీస్ తెచ్చి పెడుతుందనే బలమైన నమ్మకం తో ఉంది సమంత.
Also Read : చమ్మక్ చంద్రతో ఎఫైర్ – క్లారిటీ ఇచ్చిన సత్య శ్రీ