టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్త పీకే సర్వేలో టీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆరా సర్వే అధికార పార్టీకి అనుకూల రిజల్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పెద్దగా నెట్వర్క్ లేని ఆరా తెలంగాణలో ప్రజల పల్స్ పట్టుకున్నామని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తమ సర్వే రిజల్ట్ ను షేర్ చేసింది. ఇప్పటికే టీఆర్ఎస్ అనుకూల సర్వే సంస్థగా పేరొందిన ఆరా… ప్రస్తుత పరిస్థితిని కాస్త టీఆర్ఎస్ కు ప్రతికూలమని చెప్తూనే..బీజేపీ – టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని కాంగ్రెస్ ను కావాలనే వెనక్కి తోసినట్టుగా స్పష్టం అవుతోంది.
తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలో ఏకంగా ఏడు జిల్లాలో బీజేపీ – టీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుందని , కేవలం మూడు జిల్లాలో టీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని కాంగ్రెస్ ప్రభావాన్ని పలుచన చేసే ప్రయత్నం చేసింది. ఎన్నికల రిజల్ట్ లో ఖచ్చితమైన సర్వే సమాచారాన్ని అందించిన ట్రాక్ రికార్డ్ ఆరాకేమి లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో , హుజురాబాద్ బై ఎలక్షన్ లోనూ ఆరా అంచనాలు తప్పాయి. అలాంటి ఆరా సంస్థ చేసిన సర్వేను టీఆర్ఎస్ అనుకూల మీడియా తెగ ప్రచారం చేసుకుంటోంది.
ఉమ్మడి పది జిల్లాలో ఏడూ జిల్లాలో కాంగ్రెస్ , టీఆర్ఎస్ మధ్య థగ్ ఆఫ్ వార్ ఉండనుందంటే ఆరా సంస్థ చేస్తోన్న సర్వేకు కాస్త విశ్వసనీయత ఉండి ఉండేది. కాని పట్టణ ప్రాంతాల్లో మినహా రూరల్ లో ఏమాత్రం ఉనికి లేని బీజేపీ ఏకంగా ఏడు జిల్లాలో టీఆర్ఎస్ కు పోటీనిస్తుందని పేర్కొనటం చూస్తుంటే ఇదంతా టీఆర్ఎస్ , బీజేపీలకు బూస్టింగ్ ఇచ్చే సర్వే తప్ప జెన్యూన్ సర్వే రిపోర్ట్ కాదని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినా బీజేపీకి పదిలోపు స్థానాలకే పరిమితం అవుతుంది తప్పితే కాంగ్రెస్ స్థానాన్ని ఆక్యూపై చేసే ఛాన్స్ లేదని అభిప్రాయపడుతున్నారు.