ఆదివారం నాటి కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంచలన కథనం వెలువరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చారని పేర్కొని సంచలనానికి తెరలేపారు. కేసీఆర్ ఈ ఆఫర్ ఇచ్చేందుకు కారణం ఏంటంటే.. ఏపీలో చంద్రబాబు ఓడించాలనే పట్టుదల. మళ్ళీ జగన్ ను సీఎం చెయాలనే ఆరాటం. జగన్ ను సీఎం చేసేందుకు పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ ఎందుకు వెయ్యి కోట్లు ఆఫర్ చేశారనేది ప్రశ్నగా మారింది.
ఇందుకు కారణం ఏంటో ఆర్కే చెప్పలేదు కానీ జనసేన , టీడీపీలు కలిసి పోటీ చేస్తే ఈసారి ఏపీలో వైసీపీ ఓటమి ఖాయం. ఎన్నికల నాటికీ జనసేన- టీడీపీ రెండు పార్టీలు జట్టు కట్టే అవకాశం కనిపిస్తోంది. దీనిని అంచనా వేసిన కేసీఆర్..పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వెళ్ళకుండా చేసి.. ఏపీలో ఒంటరిగా లేదా జనసేనతో కలిసి పోటీ చేయడం కోసం పవన్ కళ్యాణ్ ను ఒప్పించేందుకు కేసీఆర్ వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చారని ఆర్కే తన కొత్త పలుకులో పేర్కొన్నారు. జగన్ కోసం కేసీఆర్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టుకునేందుకు ఎందుకు రెడీ అవుతున్నారంటే..వైసీపీ తరపున గెలిచే ఎంపీలు తన వెంటే ఉంటారన్న నమ్మకం కారణంగానే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయాన్ని ఆర్కే పరోక్షంగా పంపారు.
ఈ అంశంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. రెండు పార్టీలు కలిసి ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. జనసేన నేతలు, అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. వేమూరి రాధాకృష్ణపై విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే, తన రాజకీయ స్వార్ధం కోసం జనసేనకు కేసీఆర్ వెయ్యి కోట్ల ప్రతిపాదనలు పంపారు కానీ వాటికి పవన్ కళ్యాణ్ అంగీకరించారని ఆర్కే ఎక్కడ కూడా చెప్పలేదు. కేసీఆర్ రాజకీయాలపై పవన్ రియాక్షన్ ను కూడా ఆయన ప్రస్తావించలేదు.
ఏపీలో పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ తో జట్టు కట్టే పరిస్థితులు లేనట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు ఆరేడు శాతం ఓట్లు వచ్చాయి. అదే బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తే ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ కూడా పడిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ వెయ్యి కోట్ల ప్రతిపాదన పవన్ కళ్యాణ్ కు చేరి ఉంటే.. ఎందుకు కేసీఆర్ ఈ ప్రపోజల్స్ పంపి ఉంటారో పవన్ కు తెలియనిది కాదు. కేసీఆర్ తన మిత్రుడిని సీఎం చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని గ్రహించలేని అమాయకుడు పవన్ కాదు. కాబట్టి ఈ ఆఫర్ పవన్ కు చేరినా ఆయన నిర్ద్వందంగా తిరస్కరించి ఉండొచ్చు.
Also Read : వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఇక్కడి నుంచేనా..?