పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఏమో కానీ వైసీపీ నేతలకు మాత్రం నిద్ర పట్టడం లేదు. యాత్ర చేస్తానంటే ‘వారాహి’ వాహనం నిబంధనలకు విరుద్దంగా ఉందని అభ్యంతరం తెలిపింది. తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎందుకు చేయడం లేదని వాకబు చేస్తూ వైసీపీ నేతలు తమ పైత్యాన్ని బయటపెట్టుకుంటున్నారు. వాళ్ళో వాలకం. వాళ్ళో ప్రపంచం. వాళ్ళు అంతే.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాది ముందే పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభించారు. మధ్యలో ఆగినా.. యాత్రను అయితే కంప్లీట్ చేశారు. ఈ సారి మాత్రం ఇక రోడ్డెక్కుతున్నానని ప్రకటించి ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి పూజలు కూడా చేయించారు. కానీ వారాహి రోడ్డుమీదకు రావడానికి ఆలస్యం అవుతోంది.
మొదట్లో వారాహిపై అభ్యంతరం తెలిపిన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు వారాహి ఎందుకు రోడ్డు మీదకు రావడం లేదని వాళ్ళలో వాళ్లు పంచాయితీ పెట్టుకుంటున్నారు. ఏంటో ఈ పైత్యం. ఎలాగో పవన్ కళ్యాణ్ పై ఎదో ఒకటి కక్కాలి కదా. అందుకే, నారా లోకేష్ పాదయాత్రకు , పవన్ కళ్యాణ్ యాత్రకు ముడి వేసి విమర్శలు చేస్తున్నారు.
నారా లోకేష్ కు ఎలివేషన్ ఇచ్చేందుకే తను చేపట్టాలనుకున్న యాత్రను పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నారని డైలాగ్ లు పేల్చుతున్నారు. నిజానికి.. పవన్ కళ్యాణ్ ఎప్పుడో రోడ్డెక్కాల్సింది కానీ సినిమా షూటింగ్ వలన యాత్రను వాయిదా వేసుకుంటున్నారు. ఇందుకోసమే యాత్ర వాయిదా పడుతున్నా వైసీపీ నేతలు మాత్రం కోడి గుడ్డు మీద ఈకలు పీకేలా కామెంట్స్ చేస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉంది. అవినీతితో సంపాదించేందుకు ఆ పార్టీ నేతలకు లైసెన్స్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కు అలా దొడ్డిదారిన సొమ్ము అందదు కదా. ఆయనకు సినిమాలే తప్ప మరో మార్గం లేదు. ఎన్నికలకు ముందు పార్టీకి చాలా ఖర్చులు ఉంటాయి. ఇందుకోసమే చేతిలోనున్న సినిమాలను పూర్తి చేసి జనాల్లోకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
జనసేన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ వారాహి తో ఎప్పుడు రోడ్డెక్కుతారా..? అని వెయిట్ చేస్తున్నారు. త్వరగా సినిమా షూటింగ్ లను కంప్లీట్ చేసుకొని జనారణ్యంలోకి రావాలని కోరుతున్నారు.
Also Read : వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఇక్కడి నుంచేనా..?