ప్రధాన మీడియా సంస్థలన్నీ బీజేపీ గుప్పిట్లోకి వెళ్ళాయి. దాంతో జనం గోస ప్రపంచానికి తెలిసే అవకాశం లేకుండా పోయింది. ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ఎన్డీటీవీని కూడా అదాని కొనుగోలు చేసి మోడీకి గిఫ్ట్ ఇచ్చేశాడు. ఇక.. తమ బాధలను వ్యక్తపరిచేందుకు జనాలు సోషల్ మీడియా దిక్కుమొక్కైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతోన్న దారుణాలు సోషల్ మీడియా ద్వారా మాత్రమే బయటకు వస్తున్నాయనేది ఓపెన్ సీక్రెట్. దాంతో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
కేంద్రం ఏది ఫేక్ అని తెలిస్తే ఆ వార్తను ప్రచారం చేయకూడదని రూల్స్ తీసుకొచ్చింది. ఇందుకుగాను సమాచారహక్కు చట్టాన్ని సవరిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొద్ది రోజుల కిందట ముసాయిదా ప్రతిని రెడీ చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏదైనా వార్తను ఫేక్ గా నిర్దారిస్తే ..సామాజిక మాధ్యమాలు, వార్తా వెబ్‌సైట్స్ ఆ వార్తను ప్రచురించడానికి వీల్లేదని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు.
కేంద్ర ఐటీ ఐటీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021కి సవరణలు చేసి ముసాయిదా ప్రతిని జారీచేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు ఫేక్ వార్తలను గుర్తించే పనిని అప్పగించింది. ఇలా గుర్తించిన వార్తలను సోషల్ మీడియా, వెబ్ సైట్లలో ప్రచురించడానికి వీలు లేదు. ఒకవేళ.. వాటిని ప్రచురించి ఉంటె తొలగిస్తారు. ఈ అధికారాన్ని ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. కేంద్రానికి వ్యతిరేకంగా వార్త ప్రెజెంట్ చేస్తే దానిని తప్పుడు వార్తగా రూడీ చేసి తొలగించడం ఖాయమే.
సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా బీజేపీ వైఫల్యాలు..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతోన్న దాడులు, దారుణాలు సామజిక మాధ్యమాల ద్వారానే వెలుగు చూస్తున్నాయి. దాంతో సోషల్ మీడియాను నియంత్రించేందుకు సమాచార హక్కు చట్టాలను నియంత్రించేందుకు నిబంధనలను మార్చుతున్నారు.