ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఐదు లక్షల మంది సభకు హాజరు అవుతారని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాని ఐదు లక్షల మందిని రప్పించలేకపోయారు. కాకపోతే నిండుగా జనం కనిపించేలా కవర్ చేశారు. అయితే.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా వెయిట్ చేశారు కాని, ఆయన ప్రసంగం తుస్సుమనించింది. మునుపటి వాగ్ధాటి కనిపించలేదు. పంచ్ లు అసలే లేవు. దీంతో కేసీఆర్ కు అసలు ఏమైందని బీఆర్ఎస్ వర్గాలే ఆశ్చర్యపొయాయి. ఇంతటి కీలకమైన సభలో కేసీఆర్ ఇంత పేలవంగా మాట్లాడుతున్నారనుకోలేదని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి.
ఈ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఢిల్లీ , పంజాబ్, కేరళ సీఎంలు వచ్చారు. దాంతో జాతీయ మీడియా కవరేజ్ ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేశాయి. జాతీయ స్థాయిలో పార్టీ ఆవిర్భావ సభ పెట్టి తెలుగులో ప్రసంగిస్తే జాతీయ మీడియా ఎందుకు కవరేజీ ఇస్తుంది? అదే జరిగింది. పత్రికలు తప్ప నేషనల్ మీడియా కవరేజ్ ఇవ్వలేదు. మొత్తానికి.. ఈ సభ తెలంగాణ ప్రజల్లో కూడా బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ఎదో మ్యాజిక్ చేస్తుందన్న అంచనాలను కల్పించలేకపోయింది.
కేసీఆర్ తన లక్ష్యాన్ని ముందుగా తెలంగాణగా నిర్ణయించుకున్నారని అందుకే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీ పేరు మార్చడంతో ఈసారి తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే తెలంగాణ బిడ్డ జాతీయ రాజకీయాలు అన్నట్లు కొత్త సెంటిమెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.
మోదీ తమ వాడు అన్న కారణంతో పార్లమెంట్ సీట్లు గుజరాత్ ప్రజలు బీజేపీకే కట్టబెడుతున్నారు. భారత రాష్ట్ర సమితి తొలి ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించడం ద్వారా కేసీఆర్ గుజరాత్‌లో మోదీ స్థాయి ఆదరణను తెలంగాణలో తాను పొందాలని అనుకుంటున్నారు. జాతీయ నేతల సమక్షంలో కేసీఆర్ ప్రసంగం అంతే ఉందని అంటున్నారు. ఖమ్మం సభ ద్వారా తాను జాతీయ స్థాయికి వెళ్తున్నానని లోకల్‌లో అందరూ మద్దతుగా ఉండాలన్న ఓ అభిప్రాయాన్ని ప్రజల మనసులో పెట్టాలనుకున్నారని రాజకీయవర్గాలుఅంచనా వేస్తున్నాయి.