కె.ఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి,శృతి హసన్ ల కాంబినేషన్ లో” వాల్తేరు వీరయ్య” అనే చిత్రం తెరకెక్కింది. గత సంవత్సరం ప్రారంభమైన మూవీ షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకొని మరో వారం రోజుల్లో థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు చాలా ఆసక్తితో ఎదురుస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే చిత్రంలో కన్పించబోతున్నాడు. ఇందులో కీలక పాత్రలో ఊర మాస్ రవితేజ నటించడంతో అటు మెగా, ఇటు రవితేజ అభిమానులు ఆతృతతో వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటికే ఆ మూవీ నుండి విడుదలైన టీజర్స్ మరియు పాటలకి అభిమానుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. వచ్చే వారం ఈ మూవీ రిలీజ్ కానుండటంతో మెగా అభిమానులు ఆ మూవీపై భారి అంచనాలతో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఇక, ఈ సినిమా షూటింగ్ సమయంలో శృతిహాసన్ ఎదుర్కున్న ఇబ్బందుల గురించి ఇంటర్వ్యూ లో చెప్పింది. “నువ్వు శ్రీ దేవి అయితే..నేను చిరంజీవి అంట”అనే సాంగ్ లో శృతిహసన్ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పుకొచ్చింది.
తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. శ్రీ దేవి సాంగ్ కోసం మేమందరం నిరంతరం చాలా కష్టపడాల్సి వచ్చింది .ముఖ్యంగా నేను మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఆ సాంగ్ షూటింగ్ ని ఫ్రాన్సు మంచు కొండల మధ్య చిత్రీకరించారు. మాములుగా చలిలో ఉండడమే కష్టంగా భావిస్తానన్న శ్రుతిహాసన్… మైనస్ డిగ్రీలో వున్నా ప్రదేశాల్లో షూటింగ్ కష్టంగా అనిపించిందని చెప్పింది. దాదాపు రక్తం గడ్డ కట్టే చలిలో చిత్రీకరణ కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చింది.
ఆ మంచు ప్రదేశాలలో స్లివ్ బ్లౌజ్ తో కూడిన దుస్తువులను ధరించి చలితో వణుకుతూ ఎక్స్ ప్రెషన్ తో ఎక్స్ పోసింగ్ ఎవ్వడమనేది అసాధ్యమయినప్పటికి కూడా ఛాలెంజ్ గా తీసుకొని ఆ సాంగ్ హిట్ కోసం ఎంతో కృషి చేశానన్నది శృతి.ఈ సాంగ్ కచ్చితంగా హిట్ అవ్వుతుందని.. అభిమానులందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని శృతి హసన్ చెప్పుకొచ్చింది .