టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో వివాహంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లి కాదు కానీ కంపానియన్షిప్ కావాలనిపిస్తుందని… కాకపోతే ఈ ఏజ్ లో సెట్ కాదేమోనని చెప్పుకొచ్చారు.
1997లో ప్రగతి వివాహం చేసుకున్నారు. ఆమె పెళ్లికి ముందే తమిళ, మళయాళ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. 1976లో జన్మించిన ప్రగతి 21ఏళ్లకే వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి ఆమె ఇష్టపూర్వకంగానే జరిగినట్లు సమాచారం. పెళ్లి తరువాత మ్యారేజ్ విషయంలో తొందరపడినట్లు అనిపించిందని ప్రగతి చెబుతున్నారు.
మ్యారేజ్ చేసుకునే సమయంలో మనకు మొత్తం తెలుసుననే పెళ్లి చేసుకుంటామని తెలిపారు ప్రగతి. జీవితంలో పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్ అని, దాని విషయంలో తొందరపాటు నిర్ణయాలు అసలే తీసుకోవద్దని సూచించారు. ఏమాత్రం తొందరపడిన జీవితంలో తరువాత ఎదురయ్యే అనుభవాలు మామూలుగా ఉండవని హెచ్చరించారు. భర్తకు విడాకులు ఇచ్చాక ప్రగతి తన కూతురితో పాటు ఒంటరిగానే ఉంటున్నారు.
ఇటీవలప్రగతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా…రెండో పెళ్లి అంశంపై చర్చ జరిగింది. మీకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుందా..? అని అడగ్గా.. పెళ్లి కాదు కానీ కంపానియన్షిప్ కోరుకుంటున్నానని చెప్పింది. ఓ తోడు ఉంటె బాగుంటుందనిపిస్తుంది. కాని నాకు తగ్గట్టుగా ఆలోచించి, నడుచుకునే వ్యక్తి కావాలి కదా అంటూ చెప్పుకొచ్చింది. మొదటి పెళ్లి సమయంలో అడ్జస్ట్ అయి బ్రతికాను కాని ఇప్పుడు అలా బ్రతకలేను అంటూ స్పష్టం చేసింది. అందుకే మరో పెళ్లి ఆలోచన లేదని పరోక్షంగా చెప్పేసింది.
సోషల్ మీడియాలో ప్రగతి యాక్టివ్ గా ఉంటారు. అప్పుడపుడు జిమ్ లో కుస్తీ పడుతూ, డ్యాన్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ వయస్సులో ఇవన్నీ మీకు అవసరమా అంటూ నెటిజన్స్ నుంచి కామెంట్స్ వచ్చినా వాటిని ఆమె పెద్దగా పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంది.
Also Read : ప్రొడ్యుసర్ తో పెళ్లి వార్తలపై సురేఖ వాణి క్లారిటీ