తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో నటన నుంచి సమంత లాంగ్ బ్రేక్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులేవి అంగీకరించవద్దని సామ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత ఇటీవలే చికిత్స తీసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షించారు. అయితే, ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకునేంతవరకు నటనకు దూరంగా ఉండాలని సామ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా కోలుకున్నాకే కొత్త సినిమాలకు సైన్ చేయాలనుకుంటుంది.
సమంత చివరి సినిమా యశోదా. మయోసైటిస్ కారణంగా సినిమా ప్రమోషన్లలో పెద్దగా పాల్గొనలేదు. హిందీలో ద ఫ్యామిలీ సీజన్ 2సక్సెస్ అవ్వడంతో పలు బాలీవుడ్ సినిమాలలో నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ మధ్యలోనే అనారోగ్యానికి గురి కావడంతో కొంతకాలం నటనకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది సామ్. దీంతో అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు.
తాను ఇప్పట్లో సినిమాలు చేయడం కుదరదని నిర్మాతలకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో నిర్మాతలు సమంత బదులు ఎవర్ని తీసుకోవాలన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నారు.