నమ్రత శిరోద్కర్.. మహేష్ బాబు భార్య. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో వచ్చిన వంశీ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా నటించింది నమ్రత. ఈ సమయంలోనే వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వీరికి గౌతమ్, సితార ఇద్దరు సంతానం. ఒకప్పుడు మిస్ ఇండియా కిరీటం అందుకున్న నమ్రత, పెళ్లి తరువాత పూర్తిగా మోడలింగ్ కు దూరమైంది. ప్రస్తుత కుటుంబ వ్యవహారాలను చూసుకుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత.. మీడియాకు మాత్రం కొంచెం దూరంగానే ఉంటారు. ఈ క్రమంలోనే ఓ సీనియర్ జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానెల్ కు నమ్రత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో నమ్రత మాట్లాడుతూ.. మహేష్ తో ప్రేమ పెళ్లి, కెరీర్, పిల్లల గురించి పలు విషయాలను చెప్పుకొచ్చారు.
ఇంటర్వ్యూ అలా ఆసక్తికరంగా సాగుతుండగానే నమ్రతతో మీకు, మహేష్ బాబుకు ఎప్పుడైనా గొడవలు అయ్యాయా..? గొడవలైతే ఎక్కువగా ఏ విషయంలో జరుగుతుంటాయని జర్నలిస్ట్ ప్రశ్నించారు. అందుకు ఆమె బదులిస్తూ చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహేష్ బాబుతో ఎక్కువగా పిల్లల విషయంలో గొడవలు జరుగుతుంటాయి. ఎందుకంటే పిల్లల విషయంలో నేను కటినంగా ఉంటాను. కాని మహేష్ బాబు మాత్రం జాలీగా ఉంటాడు. దాంతో నేను ఏదైనా విషయంలో నో చెప్తే వెంటనే మహేష్ దగ్గరకు వెళ్లి తన దగ్గర ఎస్ అని చెప్పించుకుంటారు. అప్పుడే మా మధ్య గొడవ జరుగుతుంటుంది. ఆ సమయంలో కోపంతో తన మీద అరుస్తానని చెప్పింది.