హీరోయిన్ అంజలి ఎప్పటికీ గుర్తుంటుంది. తెలుగులో చేసింది కొన్ని చిత్రాలే అయినా తెలుగింటి అమ్మాయిగా తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్ సీరిస్ లో నటిస్తోంది అంజలి. గతంలో చేసిన ఝాన్సీ వెబ్ సీరిస్ కు ప్రశంసలు దక్కగా ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఫాల్’ అనే వెబ్ సీరిస్ కూడా అదే ఆదరణను సొంతం చేసుకుంది.
ఫాల్ వెబ్ సీరిస్ ప్రమోషన్ లో పాల్గొన్న అంజలి పలు విషయాలను షేర్ చేసుకున్నారు. తన పెళ్లి విషయంపై జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు. అమెరికాలో ఉంటున్న ఓ ఇండియన్ ను అంజలి పెళ్లాడారని జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.
ప్రతిసారి నా పెళ్లి విషయంలో నిరాదార వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. పెళ్లి చేసుకుంటే అందరి చెబుతాను. అప్పటివరకు ఇలాంటి నిరాధార వార్తలను ఆపండని కోరారు అంజలి. అయితే, ఓ హీరో తనను మోసం చేశాడని అంజలి చెప్పడంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎవరు అతను అని ప్రశ్నించగా ఆమె అతని పేరు చెప్పలేదు.
గతంలో ఓ వ్యక్తిని ప్రేమించాను. పూర్తిగా అతని నమ్మాను. తను మాత్రం మోసం చేశాడంటూ ఎమోషనల్ అయింది అంజలి. అయితే, అతను పేరు చెప్పనని ఎందుకంటే అది ముగిసిన అధ్యయనం అంటూ చెప్పుకొచ్చింది. అప్పటి విషయాలను గుర్తు చేసుకోవడం ప్రస్తుతం ఇష్టం లేదని తెలిపింది.
జర్నీ సినిమాలో హీరో జై తో అంజలి ప్రేమాయణం నడిపిందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరిగింది. కొన్నాళ్ళ తరువాత వీరి రిలేషన్ బ్రేకప్ అయిందట. అంజలికి తెలియకుండా మరో నటితో జై సన్నిహితంగా మెలగడంతో అతన్ని అంజలి దూరం పెట్టిందట. తాజాగా అంజలి చేసిన కామెంట్స్ తో ఆమెను మోసం చేసిన వ్యక్తి జై కావొచ్చునని అంటున్నారు.
జై తో రిలేషన్ పై అంజలి స్పందించారు. తనకు ఇండస్ట్రీలో చాలామందే స్నేహితులు ఉన్నారు. అందులో జై కూడా ఒకరు. అంతకుమించి మరేం లేదని పేర్కొంది.