క్యారెక్టర్ నచ్చాలే కాని ఎలాంటి పాత్రలోనైనా ఓదిగిపోవడం మంచు లక్ష్మి ప్రత్యేకత. ఇప్పుడు అలాంటి పాత్రే ఒకటి ఆమె చేసింది. అది తెలుగు సినిమా కాదు కనుక ఎవరు పెద్దగా మాట్లాడటం లేదు కాని, తెలుగు సినిమానే అయ్యుంటే మంచు లక్ష్మి రోల్ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళే.
మంచు లక్ష్మి అనగానే మోహన్ బాబు కూతురని గుర్తుపట్టేస్తారు. “అనగనగా ఓ ధీరుడు” తొలి సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. అదే సినిమా అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. ఆ తరువాత పలు సినిమాల్లో మంచు లక్ష్మి కనిపించినా పెద్దగా గుర్తింపు తెచ్చే పాత్రలు ఏవి లేవు. తాజాగా మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి, మోహన్ లాల్ హీరోగా నటించిన ‘మాన్స్టర్’మూవీలో పనిమనిషి క్యారెక్టర్ చేసింది.
ఆ పాత్రలో మంచు లక్ష్మి నటించడం అనేదానికంటే ఆ క్యారెక్టర్ లో జీవించిందని చెప్పొచ్చు. తెలుగులో హీరోయిన్, విలన్ రోల్స్ చేసిన మంచు లక్ష్మి ఈ సినిమాలో మాత్రం డిఫరెంట్ రోల్ లో కనిపించింది. ఆమెకు దక్కిన స్క్రీన్ స్పెస్ తక్కువే అయినా ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేసింది.
హర్యానాలో ఇద్దరమ్మాయిలు పెళ్లాడుతారు. దాంతో వాళ్ళను కొట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తరువాత ఏం జరిగిందన్నది సినిమా కథ. సినిమాలో భూమిని పాత్ర హనీ రోజ్ చేయగా.. దుర్గ అనే పాత్రలో మంచు లక్ష్మి కనిపిస్తోంది. ఈ చిత్రంలో వీళ్లిద్దరూ హోమో సెక్సువల్ గా నటించారు.వీళ్ళ మధ్య లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇందులో మంచు లక్ష్మి అద్భుతంగా నటించింది.