రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ , బీజేపీ నేతలే ఎక్కువగా కోరుకుంటున్నట్టున్నారు. అదేంటి.. టీఆర్ఎస్ , బీజేపీ నేతలెందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటారని ఆశ్చర్యపోకండి..ఈ పూర్తి స్టొరీ చదివితే అసలు విషయం మీకే అర్థం అవుతోంది.
రేవంత్ పీసీసీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్వపక్షంలోనే విపక్షంలా పరిణమించారు సీనియర్లు. వారందరిని కలిసి పార్టీ కోసం పని చేయాలని రేవంత్ కోరినా అబ్బే మేము మారమంటే మారమన్నట్లుగా వ్యవహరించారు. రేవంత్ కు సహకరించడం దేవుడెరుగు, పార్టీ పరువును బజారుకీడ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీకి ద్రోహం చేస్తూ ప్రత్యర్ధులకు సహకరిస్తున్నారు.ముసుగుదొంగలైన సీనియర్లు కాంగ్రెస్ ను వీడితే క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ వేదికగా సంబరాలు చేసుకుంటోంది.
ప్రస్తుతం పార్టీని వీడిన నేతలంతా రేవంత్ వ్యతిరేకులే. పార్టీ కోసం విరామం లేకుండా పని చేస్తున్న రేవంత్ కు బంధనాలు తగిలిస్తోన్న వారే. కాంగ్రెస్ లో నిత్య అసంతృప్తులుగా ముద్రపడిన ఆ నేతలను పిలిచి మరీ టీఆర్ఎస్ , బీజేపీలు కండువాలు కప్పెస్తుండటంతో ఏళ్లనాటి శని తొలగిపోతుందంటున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేకుల్ని టీఆర్ఎస్ , బీజేపీలే ఖాళీ చేయిస్తున్నాయని, ఇకనుంచి రేవంత్ పూర్తి స్వేచ్ఛాతో నిర్ణయాలు తీసుకొని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మార్గం సుగమం అయినట్లేనని క్యాడర్ ఆశగా చెబుతోంది.