తెలంగాణలో బలపడేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆయా పార్టీలకు చెందిన నేతలను కాంట్రాక్ట్ లతోపాటు పదవుల ఆశ చూపించి బీజేపీలో చేర్చుకుంటున్న కమలనాథులు.. తాజాగా కాషాయ క్యాంప్ లో చేరేందుకు సిద్దపడిన మర్రి శశిధర్ రెడ్డిని ఏ హామీ ఇచ్చి బుట్టలో వేసుకున్నారు..? అమిత్ షా ముందు శశిధర్ రెడ్డి ఉంచిన షరతులు ఏంటి..? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
సనత్ నగర్ లో మర్రి శశిధర్ రెడ్డికి బలమైన ఓటు బ్యాంక్ లేదు. అభిమానులు లేరు. సనత్ నగర్ నుంచి గతంలో గెలిచినా ఆయన పార్టీ వేవ్ లో గెలిచారు తప్ప సొంత ఇమేజ్ తో కాదన్నది బహిరంగ రహస్యమే. దీంతో ఆయనకు గవర్నర్ గిరిపై ఆశ కల్గింది. వెంటనే బీజేపీ తలుపు తట్టారు. తనకు గవర్నర్ గిరి ఇప్పించాలని షా ముందు ఓ ప్రతిపాదన ఉంచారని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే, గవర్నర్ గిరి ఇచ్చేందుకు అంగీకరించిన షా, ఈ పదవి దక్కాలంటే ముందుగా ఓ టాస్క్ ను కంప్లీట్ చేయాలని ఆదేశించినట్లుగా చెప్తున్నారు.
కాంగ్రెస్ ను బలహీనపరిచేలా రెడ్డి సామజిక వర్గాన్ని సాధ్యమైనంత తొందరగా బీజేపీలోకి తీసుకురావాలని మర్రి శశిధర్ రెడ్డికి అమిత్ షా బిగ్ టాస్క్ ఇచ్చారని అంటున్నారు. పార్టీలోకి చేరికలను ప్రోత్సహించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని.. కాని గవర్నర్ గిరి ఇప్పించాలని షా ను వేడుకున్నారట. అయితే, ఆయనకు వెంటనే గవర్నర్ పదవిపై హామీ ఇవ్వకపోవడానికి బండి సంజయ్ కారణమని అంటున్నారు.
శశిధర్ రెడ్డి చేరికతో అంతగా ప్రయోజనం ఏమి ఉండదని…సంజయ్ చెప్పడంతోనే ఆయన నాయకత్వంపై నమ్మకం లేక గవర్నర్ పదవిపై షా గట్టిముట్టి చెప్పలేదని అంటున్నారు.