పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతాంగానికి కేంద్రం ఆర్ధిక సాయం అందజేస్తోంది. అక్టోబర్ 17న 12వ విడత నిధులను రైతుల ఖాతాలో జమా చేసింది. అయితే చాలామంది రైతులు ఈ డబ్బులను పొందలేదు.
12వ ఇన్స్టాల్ మెంట్ ను అక్టోబర్ నెలలో కేంద్రం విడుదల చేయగా… అర్హులైన కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమా కాలేదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. డబ్బులు జమా కాని వారి అకౌంట్లలో అక్టోబర్ 24వరకు క్రెడిట్ అవుతాయని చెప్పారు కాని అకౌంట్ లో డబ్బులు పడలేదు.కేంద్రం సాయం పొందని వారు ఎం చేయాలో ఇప్పుడు చూద్దాం
వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చెయ్యాలంటే https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లో బెనెఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి గెట్ డేటా మీద నొక్కండి. ఇలా రైతుల ఖాతా లో డబ్బులు పడ్డాయా లేదా అనేది వస్తుంది.
అయినా డబ్బులు రాలేదంటే కారణం మీ ఆధార్, అకౌంట్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ లు తప్పు కావచ్చు. మీరు మొదట మీ ప్రాంతంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ సమస్యని చెప్పండి. స్పందించకపోతే హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేయండి.
ఈ పన్నెండో విడత డబ్బు అందని వారు హెల్ప్‌లైన్ నంబర్ 011 24300606 /011 23381092 కు నేరుగా డయల్ చెయ్యచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, PM కిసాన్ హెల్ప్ డెస్క్ (PM KISAN హెల్ప్ డెస్క్) pmkisan ict@gov.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. ఇలా సమస్య చెప్పి డబ్బులు పొందే అవకాశం వుంది.