హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోలేదు. ఈ విషయాన్ని ఆమె ప్రకటించింది. పూర్తి ఆరోగ్యవంతంగా తయారు అవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది సమంత.
తనకు అనారోగ్యానికి గురి అయ్యాయని సమంత చెప్పడంతో కొన్ని యూట్యూబ్ ఛానెళ్ళు , వెబ్ సైట్లు పిచ్చి పిచ్చి హెడ్డింగ్ లతో కథనాలను ప్రసారం చేశాయి. చావు బతుకుల మధ్య సమంత అనే హెడ్డింగ్ పెట్టేసి వ్యూస్ కోసం కక్కుర్తి పడ్డాయి. ఈ విషయం సమంత వద్దకు చేరడంతో ఆమె ఎమోషనల్ గా సమాధానం ఇచ్చింది.
సామ్ నటించిన “యశోదా” చిత్రం శుక్రవారం విడుదల కానుంది. దాంతో తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది సమంత. ఈ నేపథ్యంలోనే చిత్ర విషయాలపై ప్రశ్నించగా ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఆ తరువాత తన ఆరోగ్యంపై స్పందించింది. మీరు ఎలా ఉన్నారని ప్రశ్నించగా తాను బతికే ఉన్నా.. ఇంకా చావలేదు అంటూ ఎమోషనల్ అయింది.
నా ఆరోగ్యంపై చాలా రకాల కథనాలు ప్రసారం చేశారు. ఇప్పుడు అదంతా అనవసరం అంటూ మాట దాటేసింది సమంత.