తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు రాష్ట్రంలో మంచి ఆదరణ ఉంది. రాజకీయ ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి త్యాగమే చేసింది హస్తం పార్టీ. ప్రజల్లో పార్టీపై ఆదరణ చెక్కుచెదరకపోయినా నేతల మధ్య అనైక్యతే కాంగ్రెస్ ను బలహీనపరుస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు చేపట్టాక పార్టీలో మంచి జోష్ కనిపించింది. పార్టీకి పునరుజ్జీవం పోసేందుకు రేవంత్ ఒక్కడై ప్రయత్నిస్తున్నా మిగతా నేతల నుంచి సహకారం కొరవడటంతో పార్టీ అనుకున్నంత స్థాయిలో బలపడటం లేదు.
రేవంత్ రెడ్డి ఒంటరిగానైనా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయగలడన్న ధీమా క్యాడర్ లో కనిపిస్తోంది. కాని కోవర్ట్ నాయకుల తీరే ఆయనకు ఆటంకంగా మారుతుంది.అదే సమయంలో సీనియర్ నేతల వ్యవహారశైలి ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రంగా మారుతుంది. టీఆర్ఎస్ , బీజేపీ నుంచి విమర్శల మోత మోగుతున్నా తమ దారి తమదేనంటూ సీనియర్లు రేవంత్ కు సహాయ నిరాకరణ చేస్తున్నారు. పార్టీని బతికించుకుందాం..మీరు సహకరించుకున్నా పరవాలేదు కాని రేవంత్ రెడ్డికి అడ్డుపుల్లలు పెట్టకుండని క్షేత్రస్థాయిలో క్యాడర్ వేడుకుంటున్నా కొంతమంది సీనియర్లు మాత్రం అబ్బే తాము మారమంటూ నక్కజిత్తుల వేషాలు ప్రదర్శిస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకమైనదని తెలిసినా.. ప్రచారానికి సీనియర్లు దూరంగా ఉండిపోయారు. పార్టీలో తామే తోపులమని..తమ వల్లే కాంగ్రెస్ బలంగా ఉందని తాము లేకపోతే పార్టీ ఉండదు.. క్యాడర్ ఉండదంటూ గొప్పలు చెప్పుకునే నేతలు కీలక సమయంలో వెన్నుచూపారు. తిరిగి ఈ నేతలే మళ్ళీ తమకు టీపీసీసీ చీఫ్ పదవి కావాలంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కష్టాల కడలిలో పార్టీ ఈదుతుంటే తీరానికి చేర్చాల్సిన నేతలు..రేవంత్ కాళ్ళకు బంధనం వేసి కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.
వ్యక్తిగత ఇమేజ్ కోసం పాటుపడే సీనియర్లు రేవంత్ ను కిందకు లాగితే వారి రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని మునుగోడు ఉప ఎన్నిక సీనియర్లకు రుచిచూపించింది. మరి దీని చూసైన మిగతా సీనియర్ నేతల వ్యవహారశైలిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.