మునుగోడు ఉప ఎన్నికల ప్రస్తుత పోలింగ్ ట్రెండ్స్ ను పరిశీలిస్తే కాంగ్రెస్ బలంగా పుంజుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పోల్ అయిన ఓటింగ్ శాతం ప్రకారం అత్యధిక ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఖాతాలో పడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా యువత, మహిళలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక, నిన్నటివరకు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట తిరిగిన పార్టీ కార్యకర్తలు కూడా కమలానికి ఓటేసేందుకు విముఖత చూపుతున్నారు. మొదటి నుంచున్న పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా తనతోపాటు బీజేపీలో చేరినవారికే రాజగోపాల్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడంతో రగిలిపోయిన కమలం కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థికి ఒటేస్తున్నట్లు తెలుస్తోంది.
సర్వే ఫలితాలను తెరమరుగు చేస్తూ ఓటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి దూసుకుపోతున్నట్లుగా మునుగోడు ఎన్నికల పరిణామాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మూడు మండలాల్లో కాస్త బలహీనంగా ఉందని తేలినప్పటికీ అక్కడ కూడా కాంగ్రెస్ సత్తా చాటుతోంది. మహిళా గర్జన సభలో పాల్వాయి స్రవంతి దుఃఖానికి మునుగోడు మహిళలు కూడా కంటతడి పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పైగా, తన తండ్రి చివరి శ్వాస వరకు మునుగోడు అభివృద్ధి కోసం పాటుపడిన చరిత ఆమెకు కలిసోస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక, టీఆర్ఎస్ కూడా కొంత పోటీ ఇస్తున్నట్లు తేలుతున్నా… కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గతంలో గెలుపొందినా ఏమి చేయలేదని మునుగోడు జనం బలంగా విశ్వస్తిస్తున్నారు. పైగా, ఆయన గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో గట్టిగా వాయిస్ వినిపించే అవకాశం లేదని నమ్మడంతో టీఆర్ఎస్ కు ఓటు బ్యాంక్ చేజారుతున్నట్లు సమాచారం. అలాగే, పలు ప్రాంతాల్లో ఓటుకు పదిహేను ఇస్తామని ఆశలు పెట్టిన టీఆర్ఎస్ చివరికి మూడు వేలు మాత్రమే ఇవ్వడం కూడా టీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారింది.