సంచలన కథనాలతో అనతికాలంలోనే విశేష ఆదరణ పొందిన ఓ డిజిటల్ పేపర్ దిశ తన ట్యాగ్ లైన్ కు విరుద్దంగా వార్తా వ్యాఖ్యానాలు ప్రచురితం చేస్తోంది. మేము సత్యం వైపంటూ ట్యాగ్ లైన్ లో పేర్కొని అసత్యాలను పాఠకుల మదిల్లోకి ఎక్కిస్తోంది. మొదట్లో జనాల్లో ఆదరణ కోసం సంచలనాత్మక కథనాలతో దుమ్మురేపిన ఈ పత్రిక తెలంగాణకు దశ దిశను సూచిస్తుందని అంత నమ్మారు. దాంతో ఆ పత్రికకు పాఠకుల ఆదరణ పెరిగింది. నమ్మి నానబోస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు..ఆ పత్రికను విశ్వసించి చదివితే అవాస్తవ కథనాలు కుప్పలు, తెప్పలుగా రాలుతుండటం కనిపిస్తోంది.
పత్రిక రంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న దిశ పత్రిక మెల్లమెల్లగా తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటుంది. పత్రిక విలువలకు మంగళం పాడుతూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోంది. కీలక నేతలే లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తూ.. ఈ కథనాల పరంపర నిలిచిపోవాలంటే తాము డిమాండ్ చేసినంత ఇచ్చుకోవాల్సిందేనని నిసిగ్గుగా వేధిస్తోంది. ఏదీ వాస్తవమో,ఏది అవాస్తవమో విడమరిచి చెప్పాల్సిన పత్రిక అవాస్తవాలను అందంగా పేర్కొంటూ టార్గెట్ చేసిన నేతలను వేధించడమే కాదు..ప్రజలను ఫూల్స్ చేస్తోంది.
ఓ జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అద్యక్షుడిని కోటి రూపాయలు డిమాండ్ చేసింది. తాము డిమాండ్ చేసినంత ఇచ్చుకోకపోతే లిక్కర్ స్కాంలో నీ ప్రమేయం ఉందంటూ డైలీ పేపర్ లో వార్త తప్పనిసరిగా ఉంటుందంటూ బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు..బీజేపీలోని ఓ ఎమ్మెల్యేను కూడా 50లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. లేదంటే పార్టీలో నీకు ప్రాధాన్యత లేదు..అధిష్టానం నీపై సీరియస్ అవుతుందంటూ కథనాలు ప్రచురితం అవుతాయని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
ఈ బ్లాక్ మెయిల్ కు తలోగ్గని సదరు ఇద్దరు నేతలపై పనిగట్టుకొని ఆ పత్రిక బురదజల్లుతోంది. ఓ నేతకు లిక్కర్ మరకలు అంటించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే…పదవి కూడా పోనుందని తప్పుడు విశ్లేషణలు చేస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తోంది. అయితే, కాషాయ రంగు పులుముకున్న దిశ పత్రిక బీజేపీ ఎమ్మెల్యేపై కూడా తప్పుడు రాతలు రాసి, బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నింస్తుందంటే లోలోపల చాలానే జరుగుతుందన్నమాట.