ప్రతి ఆహారపు గింజను వృధా చేయకుండా కాపాడినట్లయితే ఆ గింజను మనము పండిoచి నట్టే లెక్క! ఆహారం వృధా చేయకపోతే దేశ సంపదను సృష్టించినట్లు! మనం బతకాలంటే ఆహారం తినాలి, ఆహారం వృధాగా పారేయడానికి ఒక్క నిమిషం చాలు… కానీ అదే ఆహారాన్ని పండించడానికి 6 నెలల సమయం( అన్నీ అనుకూలిస్తే) పడుతుంది.మనం తినే ఆహారం విత్తనం నుండి మొదలు తినే వరకు 18 రూపాల్లో మారి ఆహారంగా తయారవుతుంది.
ఉదాహరణకు:- రైతు, రైతు కూలీలు,విత్తనం, భూమి, వాతావరణం, నీరు, మార్కెట్, కరెంటు, అమ్మ, చేసే వంట పని మొదలైనవి. ఒక ఆహారపు గింజ తయారు కావాలంటే దాదాపు 22 వ్యక్తులు, లేదా సంస్థల ప్రోత్సాహం అవసరం. ఉదాహరణకు:- రైతు, భూమి,నీరు, పశువులు, ఎరువులు, కూలీలు, కరెంటు, వాతావరణం మొదలైనవి. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదలు తాము సంపాదించిన డబ్బులు 60 నుండి 80 శాతం వరకు ఆహారానికే ఖర్చు పెడుతున్నారు. అయినా వారికి పోషకాహారం అందడం లేదు.ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆహారధాన్యాల లో 35 శాతం వరకు వృధా అవుతున్నాయి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు ఒకవైపు తిండిలేక ఎన్నో దేశాలు మలమలమాడిపతూఉంటే మరోవైపు వందల కోట్ల విలువైన ఆహార ధాన్యాలు ప్రతిరోజు వృధా చేస్తున్నాం. ఆహారం వృధాను కనీస స్థాయికి తగ్గించగలిగితే ప్రపంచ ప్రజలకు ఆహార లభ్యత పెంచవచ్చు. FAO (Food and Agricultural Organization ) ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 130 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. ఇలా వృధా పోతున్న ఆహారం దాని విలువ సుమారు 75000 కోట్ల డాలర్లు.
భారతదేశం లో ఉత్పత్తి అవుతున్న ఆహారధాన్యాలలో సంవత్సరానికి 40శాతం వృథా అవుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. దీని విలువ సుమారు 58 వేల కోట్ల రూపాయలు. మన దేశంలో పండించిన పండ్లు కూరగాయలు రైతు నుంచి వినియోగదారులకు చేరే మధ్యకాలంలో 40 శాతం వృధా అవుతున్నాయి.ప్రతి జీవరాశి మనుగడకు ప్రధాన జీవనాధారం ఆహారం, ఆహారం లేనిదే ఏ ప్రాణి జీవించడం జరగదు. ప్రతి ప్రాణికి అవసరమైన ఆహారాన్ని వృధా చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో 822 మిలియన్ల మంది బాధపడుతున్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా అనేక దేశాల్లో ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయి. Global hunger index 2021-22 ప్రకారం 101 దేశాల్లో, ఇండియా ఆకలి లో 102 వ స్థానంలో global food security 71 స్థానంలో ఉండడం గమనార్హం. భారతదేశం ఆకలి, పోషకాహార లక్ష్యాలను 2025 నాటికి కోల్పోతుందని Global nutrition report 2020 తెలిపింది.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆహార దినోత్సవం జరుపుకుంటాo. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన (FAO) ఆహార మరియు వ్యవసాయ సంస్థ 1945 అక్టోబర్ 16న నెలకొల్పింది. ఈ సంస్థ గౌరవార్థం సంస్థ ఏర్పడిన రోజును ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ప్రపంచ ఆహార దినోత్సవం మొట్టమొదటిసారిగా 1981, అక్టోబర్ 16 నుండి జరుపుతున్నారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఆకలి తీర్చడానికి అందరికీ, ఆహార భద్రతను, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, నాణ్యమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా పొందేలా చూడడం. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఆకలి లేని ప్రపంచం గా మార్చాలని ఎఫ్ఏఓ ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో 197 సభ్యత్వ దేశాలలో ఎఫ్ఏఓ 130 పైగా దేశాలలో పనిచేస్తుంది. 2050 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లు దాటుతుందని అంచనా ! ప్రపంచ జనాభా ఇప్పుడు 750 కోట్లు ఉంటే కేవలం ఒక్క పూట తిండికి నోచుకోని వారి సంఖ్య 150 కోట్లకు పైమాటే? దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఆకలిచావులు పర్వం కొనసాగుతూనే ఉంది.
పోషకాహార లోపం ఒక తరం నుండి ఇంకొక తరానికి వెళ్లే ఒక చక్రం లాంటిది.దీనితో ప్రజలకు పోషకాహారం అందక ప్రజానీకం తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఈ పరిస్థితులు ప్రజల యొక్క ఆదాయ,వ్యయం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనితో పుట్టే పిల్లలు ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు పొత్తిల్లోనే చనిపోతున్నారు, పిల్లలు మానసిక,శారీరక ఎదుగుదల తగ్గుతుంది, పాఠశాలకు ఎక్కువగా డ్రాపౌట్ అవుతున్నారు, చదువు రాక తక్కువస్థాయి ఉద్యోగాన్ని చేసుకొని జీవిస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యే ప్రమాదం ఉంది.
FAO తాజా అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం 130 కోట్ల టన్నుల ఆహారం ప్రపంచవ్యాప్తంగా వృధా అవుతుంది. ప్రస్తుతం ఇండియా జనాభా 130కోట్లకు పైగా ఉంది. FAO అంచనా ప్రకారం ఇండియాలో ఇప్పుడు PDS ద్వారా 81 కోట్ల మందికి నిత్యవసర సరుకులు భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య దాదాపు 20 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య 1/3 మన ఇండియాలోనే ఉండడం బాధాకరం. ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 34 శాతం, వృద్ధుల 15శాతం, అలాగే 15 నుంచి 49 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు 51%( రక్తహీనతతో) పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పటికి ఇండియాలో ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి.ఇండియాలో FCI దగ్గర ఇప్పటికి సుమారు 51.14 మిలియన్ టన్నుల ఆహార నిల్వలు గోడౌన్లలో ఉన్నాయి. “గోడౌన్లలో ఆహారధాన్యాలు ప్రజల కడుపులో ఆకలి మంటలు”. ఇండియాలో ఇప్పటికీ 20 కోట్ల మంది రాత్రిపూట( ఎక్కువగా మహిళలు) తినకుండా నిద్రపోతున్నారు. ఏప్రిల్ 23, 2013 సం. జాతీయ ఆహార భద్రత చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 75%, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం ప్రజలు చట్టం కింద వస్తారు. వీరందరికి కూడా పౌష్టికాహారం అందించే బాధ్యత ప్రభుత్వానిది. అందులో భాగంగానే PDS, ICDS,MDM మొదలైన పథకాన్ని అమలు చేస్తూ పోషకాహారం అందజేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తులు జనాభాకు సరిపడా రీతిలో పెరగడం లేదు, అందుకు గల కారణాలు:- పంటలు పండించే భూ విస్తీర్ణం( రియల్ ఎస్టేట్, పారిశ్రామికీకరణ) తగ్గడం, ప్రతిరోజు రెండు వేల మంది వ్యవసాయం వదిలి పెట్టడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం, వ్యవసాయ రంగంపై ఆశించిన పరిశోధనలు జరగకపోవడం, పండించిన పంటలను అన్ని దేశాల్లో వృధా చేయడం,అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగంలో వృధా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పంట కోత, పంట నిలువలు లో 40 శాతం వృధా అవుతుంది. కోతల సమయంలో 10 శాతం వృద్ధి అవుతుంది, ఆహార ధాన్యాల నిల్వ చేయడానికి సరైన గోడౌన్స్ లేకపోవడం,ఉన్న గోడౌన్ లో ఎలుకలు, పురుగులు మొదలైన పాడుచేస్తాయి. పెండ్లిళ్లు, ఫంక్షన్లు, హోటల్లు వండిన ఆహార పదార్థాలు చాలా వృధా అవుతాయి. (చాలామందికి మేము డబ్బులు పెట్టి కొంటున్నాం దాన్ని ఎలాగైనా చేసుకునే హక్కు మాకు ఉందినే కారణంతో మన లాంటి దేశాల్లో ఆహారం వృధా అవుతుంది.)పై కారణాలతో ఆహార కొరత ఏర్పడుతుంది.
ఆహార కొరత తీరాలంటే:- ఆహార ధాన్యాల నిల్వల సదుపాయాలు పెంచడం, వినియోగదారుల ఆహార వృధా పైన అవగాహన పెంచడం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనివ్వడం, ఆహారధాన్యాల ధరలు తగ్గించడం, పంట కోత అనంతరం సాంకేతికత అందుబాటులో తేవడం, తగిన మౌలిక వసతులు లేకపోవడం,ప్యాకింగ్ సక్రమంగా చేయకపోవడం,శీతల గిడ్డంగులు లేకపోవడం రైతులు,వ్యాపారులు వినియోగదారులు ఆహార ఉత్పత్తుల నిల్వ అవగాహన లోపం, పలు స్థాయిలలో అవినీతిమయం తదితర కారణాలతో భారత్ లో ఆహార ఉత్పత్తులు వృధా అవుతున్నాయి. వీటిపైన ప్రభుత్వాలు,ప్రజలు చిత్తశుద్ధితో పనిచేయాలి. భారత్ లో ఆహార భద్రతను సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న, ఆహార వృధా పైన శ్రద్ధ పెట్టడం అత్యంత ఆవశ్యకం. ఆహారం వృధా పైన దేశవ్యాప్తంగా వార్తాపత్రికలలో, టీవీలలో ప్రకటనలు,సోషల్ మీడియాలో ప్రచారం ఆహారము యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ సభలు, సమావేశాలు పాఠ్యపుస్తకాలలో ఆహార ప్రాముఖ్యం తెలియజేస్తూ పాఠాలు మొదలైన కార్యక్రమాలతో ప్రజలకు అవగాహన కల్పించాలి.ముఖ్యంగా కూరగాయలు,పండ్లు నిల్వలో సాంకేతికత పెంచి వృధా కాకుండా చూడాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలి, నిల్వ ఉంచిన ఆహారధాన్యాల పైనా రైతులకు 90% రుణాలు ఇవ్వాలి, అన్ని పంటల పైన పరిశోధనలు జరగాలి, వ్యవసాయంను బాగా ప్రోత్సహించాలి, ప్రభుత్వాలు భారీగా వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలి. అన్ని పంటలకు లాభసాటి ధర వస్తేనే యువత వ్యవసాయ రంగం వైపు వస్తారు. దీనితో ప్రజలకు తగినంత ఆహారం అందించగలము. అప్పుడే ఆహారభద్రత సాధించగలము.
పులి రాజు,
సామాజిక కార్యకర్త, 9908383567.
( అక్టోబర్ 16, ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా).