నిన్నటి టీఆర్ఎస్-కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ ప్లీనరీ సమావేశం ఫైవ్ స్టార్ హోటల్ వంటి హైటెక్స్ లో ఘనంగా జరుపుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ చూస్తుంటూ కూట్లో రాయి తీయలేని వాడు.. ఏట్లో రాయి తీసునట్లు ఉంది.
ఈ ఎనిమదేండ్ల కాలంలో తెలంగాణను అథోగతి పాలు చేశాడు. రాష్ట్రంలో ప్రతి రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డ్రగ్స్ మాఫియా అడ్డగా రాష్ట్రం మారింది. ప్రభుత్వ ఆస్తులు అమ్మడాలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, అవినీతి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రతి రోజూ ధరలు పెరుగుతున్నాయి..
పథకాల పేరుతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రాదు ప్రజలను దగా చేస్తున్నారు.
ఇవాళ తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించిన 1200 మంది అమరుల ఆత్మలు క్షోభిస్తున్నాయి.
కేసీఆర్ జీవీతమే మోసం తో ప్రారంభమైంది. జీవితమంగా దోపిడీ, మోసాలు చేస్తున్నడు కల్వకుంట్ల చంద్రశేకర్ రావు. చితంమడక నుంచి బాల్యం నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మోసాలు మొదలయ్యాయి. ఆయనపై ఎన్నికల సమయంలో రూ. 500 దొంగనోట్ల కేసు కేసు బుక్ అయింది..
తెలంగాణకై ఉద్యమించిన మేము పదవులు లెక్కచేయకుండా ప్రజానీయంతో కలిసి ఉద్యమంలొ పాల్గొన్నాము. బిడ్డలు ప్రాణాలు పోతుంటే తట్టుకోలేక శ్రీమతి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు.. ప్రజాస్వామ్యంలో జవాబుదారీ తనం ఉండాలంటూ.. మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయంగా నష్టపోయిన తెలంగాణ ప్రజలు సంతోషం గా ఉండాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది..
తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, దానం నాగేందర్ లాంటి వారు ని పక్కన పెట్టుకుని కేసీఆర్ ప్లీనరీ చేశారు. ఉద్యమ ద్రోహులను కేసీఆర్ పొగుడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు రోడ్డుపై ఉన్నారు..
ఉద్యమ పార్టీ అన్న కేసీఆర్ కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి. తెలంగాణకు కేసీఆర్ ఏం చేసారని.. దేశ రాజకీయాల్లో కి వెళ్తారు. ఉద్యమ పార్టీకి రూ.వెయ్యి కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి?
ఇంత తక్కువ సమయంలో ఇన్ని వందల కోట్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎలా వచ్చాయి. రాష్ట్రానికి అప్పులు… కేసీఆర్ గొప్పలు… జనంకి తిప్పలు అన్నట్టు మారింది పరిస్థితి
తెలంగాణ రాష్ట్ర సమితికి వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇన్ని రోజులు బీజేపీ తో అంటకాగిన ..కేసీఆర్ ఇప్పుడు విమర్శిస్తే నమ్ముతామా..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే టీఆర్ఎస్ బీజేపీ నాటకాలాడుతున్నాయి. టీఆర్ఎస్ కు 30 సీట్ల కంటే ఎక్కువ రావని.. కేసీఆర్ కు రిపోర్ట్ ఉంది.
ముక్కోణపు పోటీ కోసమే..టీఆర్ఎస్ బీజేపీని హైప్ చేస్తుంది. కేసీఆర్ కుట్ర పూరితంగా మళ్లీ గెలవాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ తో పొత్తు అనే ఇండికేషన్ లు ఇస్తున్నాడు.. అయన బీజేపీని బలోపేతం చేసే పనిలో ఉన్నాడు.
తెలంగాణ ప్రజల గుండెళ్ళో గులాబీ మల్లు గుచ్చుకుంది.. . ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ ఎక్కడో ఉంది