కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నా
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో 350 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను అచ్చే దిన్ తీసుకొస్తానని ఇప్పుడు 1050 రూపాయలకు పెంచి ప్రజలకు సచ్చే దిన్ తీసుకొచ్చాడు
8ఏండ్లల్లో ఎంత మందికి కొత్త ఫించన్లు , డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చారు?
ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరకుండా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం కోసం పీపుల్స్ మార్చ్ రణయాత్ర
కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు పిపిటి కిట్లు ధరించి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను తిరిగి ప్రజలకు వైద్యం అందేలా కృషి చేశాను.
పాదయాత్రలో తెలుసుకున్న మీ అందరి సమస్యలను అసెంబ్లీలో గొంతెత్తి ప్రస్తావిస్తాను. అప్పటికి ప్రభుత్వం పరిష్కరించకుంటే ప్రగతి భవన్ గేటు బద్దలు కొట్టుకుని సీఎం ముందు బైఠాయించి ఒత్తిడి తీసుకువచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తా..