గుండెల నిండా ప్రేమతో నా పాదయాత్రకు స్వాగతం పలికిన బయ్యారం ప్రజలకు ధన్యవాదాలు
ప్రతి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడినికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈ పాదయాత్ర…
8 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి… ఇల్లు, ఫించన్, ఇండ్ల స్థలాలు, ఉద్యోగాలు రేషన్ కార్డులు ఇవ్వలేదు.
నిత్యావసర ధరలు ఆకాశాన్నంటితే ప్రజలు కోనేది ఎట్లా? తినేది ఎట్లా?
కాంగ్రెస్ ప్రభుత్వం 9 రకాల రేషన్ సరుకులు ఇస్తే.. సంపద పెరిగిన తెలంగాణలో 18 సరుకులను ఇవ్వాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సరుకులను బంద్ చేసి పేదల కడుపు కొడుతుంది.
టిఆర్ఎస్ పాలనలో అభయ హస్తం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ కార్డ్ పనిచేయడం లేదు.
ఒక్కొక రైతు ఒక్కొక బాధ చెపుతున్నారు….పత్తిని గులాబీ పురుగు,మిర్చిని తామేర పురుగు నాశనం చేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తున్న చీడ పీడల మాదిరిగానే అలాగే గులాబీ పార్టీ పాలకులు రాష్ట్రాన్ని, తామర పువ్వు పార్టీ పాలకులు దేశ సంపదను డొల్ల చేస్తున్నాయి..
రైతులకు వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్, పాలీహౌస్, రైతు ప్రోత్సాహకాలు అన్ని బంద్ చేశారు.
మధిర మండలం బయ్యారంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్పా ఈ 8 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు.
అల్లినగరం నుంచి బయ్యారం మీదుగా మోటమర్రి గ్రామానికి రోడ్డు వేయించేందుకు చేస్తాను
బయ్యారం ఏటీమాముల వద్ద చెక్ డ్యామ్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తాను.
మధిర మున్సిపాలిటీ లో కలిసిన మడిపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అల్లినగరం, బయ్యారం గ్రామాలకు సపరేట్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయించి పాస్బుక్కులు రైతులకు వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాను.