కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న అబద్దపు వార్తలకు HMDA వెల్లడించిన నిజాలు చెక్ పెట్టాయి. HMDA పరిధిలో అప్లికేషన్ల పరిష్కారం ఆలస్యం అవుతుందని, TGbPASS ద్వారా నిర్మాణ అనుమతులు ఆలస్యం అవుతున్నాయని కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో కొద్దిరోజులు విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. HMDA లో అప్లికేషన్ల సంఖ్య చాలా తగ్గిందని, వాటి క్లియరెన్స్ ప్రక్రియ కూడా నెమ్మదిగా సాగుతున్నదని మీడియాలో రాసుకొచ్చారు. కానీ అవేమి నిజాలు కాదని HMDA స్పష్టం చేస్తోంది. అనుమతుల ప్రక్రియ గతంలో పోలిస్తే వేగవంతమైందని అధికారులు తెలిపారు. తమ నుంచి ఎలాంటి వివరాలు, వివరణ కోరకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అందించడం ఏ మాత్రం మంచిది కాదు. HMDA కు వచ్చిన అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారయంత్రాంగం శ్రమిస్తోందన్నారు. అంతేకాదు గతడాదితో పోలిస్తే అప్లికేషన్ల సంఖ్య కూడా పెరిగిందని, నిత్యం సమీక్షలతో వాటిని పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తోందన్నారు అధికారులు. ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం జరుగడం లేదు. మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలను నమ్మొద్దని పౌరులను కోరారు.
పలు మీడియాల్లో వచ్చిన అసత్య కథనాలను తోచిపుచ్చుతూ అసలైన నిజాలను మీ ముందు ఉంచుతున్నాం.
- 2023తో పోలిస్తే పెరిగిన కొత్త అప్లికేషన్ల సంఖ్య
- 2023 జూన్- అక్టోబర్ మధ్యతో పోలిస్తే 39 శాతం ఎక్కువగా అప్లికేషన్లు
- 2023తో పోలిస్తే ఈ ఏడాది 14.4 శాతం పెరిగిన అప్లికేషన్ల పరిష్కారం
- భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల కోసం వచ్చే అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించేదిశగా HMDA ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది.
- HMDAకు వచ్చిన అప్లికేషన్లపై ప్రతి వారం సమీక్ష. ప్రతి బుధవారం ప్రత్యేకంగా అధికారుల వారీగా దరఖాస్తుల పరిష్కారంపై మెట్రోపాలిటన్ కమిషనర్ సమీక్ష
- ప్రతి ఫైల్ పై ప్రత్యేకమైన శ్రద్ధ, ఏ ఫైల్ అయినా సరే ఏ ఒక్క అధికారి దగ్గర 10 రోజులకు మించి నిలిపివేయకుండా చర్యలు
- పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేసేందుకు అక్టోబర్ చివరి వారంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఫలితంగా పెండింగ్ అప్లికేషన్ల లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది.
- 2023 సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు 1356 కొత్త అప్లికేషన్ల స్వీకరణ
- 2024 సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు ఏకంగా 1884 అప్లికేషన్ల స్వీకరణ
- గతేడాదితో పోలిస్తే ఏకంగా 39 శాతం ఎక్కువగా దరఖాస్తుల స్వీకరణ
- 2023 సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు పరిష్కరించిన అప్లికేషన్లు 2038
- 2024 సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు 2332 అప్లికేషన్ల పరిష్కారం
- గతేడాదితో పోలిస్తే 14.4 శాతం ఎక్కువగా దరఖాస్తుల పరిష్కారం
- ఒక అధికారి దగ్గర 10 రోజులకు మించి పెండింగ్ లో ఉండే అప్లికేషన్ల సంఖ్య గతంలో 150 ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 10 కంటే తక్కువగా ఉంది
- 2023 నవంబర్ లో 267 కొత్త అప్లికేషన్లు
- 2024 నవంబర్ 16 వ తేదీ వరకు వచ్చిన కొత్త అప్లికేషన్లు 208
- గతేడాదితో పోలిస్తే 46.1 శాతం వృద్ధి నమోదు
- 2023 నవంబర్ లో పరిష్కరించిన అప్లికేషన్ల సంఖ్య 427
- 2024 నవంబర్ 16వ తేదీ వరకు పరిష్కరించిన అప్లికేషన్ల సంఖ్య 304