Polytricks.in

కేసీఆర్ హ‌యాం కంటే మెరుగ్గా రియ‌ల్ ఎస్టేట్, HMDA నివేదిక‌లో దిమ్మ‌దిరిగే నిజాలివిగో..

కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోయింద‌న్న అబ‌ద్ద‌పు వార్త‌ల‌కు HMDA వెల్ల‌డించిన నిజాలు చెక్ పెట్టాయి. HMDA ప‌రిధిలో అప్లికేష‌న్ల ప‌రిష్కారం ఆల‌స్యం అవుతుంద‌ని, TGbPASS ద్వారా నిర్మాణ అనుమతులు ఆల‌స్యం అవుతున్నాయ‌ని కొన్ని ప్రింట్, ఎల‌క్ట్రానిక్, డిజిట‌ల్ మీడియాల్లో కొద్దిరోజులు విప‌రీతంగా త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారు. HMDA లో అప్లికేష‌న్ల సంఖ్య చాలా త‌గ్గింద‌ని, వాటి క్లియ‌రెన్స్ ప్ర‌క్రియ కూడా నెమ్మ‌దిగా సాగుతున్న‌దని మీడియాలో రాసుకొచ్చారు. కానీ అవేమి నిజాలు కాద‌ని HMDA స్ప‌ష్టం చేస్తోంది. అనుమ‌తుల ప్ర‌క్రియ గ‌తంలో పోలిస్తే వేగ‌వంత‌మైంద‌ని అధికారులు తెలిపారు. త‌మ‌ నుంచి ఎలాంటి వివ‌రాలు, వివ‌ర‌ణ కోరకుండా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురించ‌డం స‌రికాదన్నారు. బాధ్య‌తాయుత‌మైన మీడియా సంస్థ‌లు ఇలాంటి త‌ప్పుడు స‌మాచారాన్ని అందించ‌డం ఏ మాత్రం మంచిది కాదు. HMDA కు వ‌చ్చిన అప్లికేష‌న్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించేందుకు అధికార‌యంత్రాంగం శ్ర‌మిస్తోందన్నారు. అంతేకాదు గత‌డాదితో పోలిస్తే అప్లికేష‌న్ల సంఖ్య కూడా పెరిగిందని, నిత్యం స‌మీక్ష‌ల‌తో వాటిని ప‌రిష్క‌రించేందుకు అధికార యంత్రాంగం ప‌నిచేస్తోందన్నారు అధికారులు. ఈ విష‌యంలో ఎక్క‌డా నిర్ల‌క్ష్యం జ‌రుగ‌డం లేదు. మీడియాలో వ‌చ్చిన అవాస్త‌వ క‌థ‌నాల‌ను న‌మ్మొద్ద‌ని పౌరుల‌ను కోరారు.

ప‌లు మీడియాల్లో వ‌చ్చిన అస‌త్య క‌థ‌నాల‌ను తోచిపుచ్చుతూ అస‌లైన నిజాల‌ను మీ ముందు ఉంచుతున్నాం.

Exit mobile version