ఏపీ అసెంబ్లీని రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందస్తుకు కేంద్రం అనుమతి కోసం జగన్ ఏ క్షణమైనా ఢిల్లీ బాట పట్టనున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీతోపాటు హోంమంత్రి అమిత్ షా తో చర్చిస్తారని అంటున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జమిలి ఎన్నికల కోసమేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ లోనే ఎన్నికలు ఉంటాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. జగన్ కూడా ఇదే ఆలోచనతో ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారు.
నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి అసెంబ్లీని సమావేశాపర్చాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఏపీ అసెంబ్లీని మరికొద్ది రోజుల్లో సమావేశపరిచి.. తన హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అసెంబ్లీ వేదికగా జనాలకు తెలియజేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నారన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఎన్నికల కోసమేనని అంటున్నారు. అయితే.. జగన్ ముందస్తు నిర్ణయానికి కేంద్రం పచ్చజెండా ఊపాలి, అందుకే ఆయన ఢిల్లీ బాట పడతారని అంటున్నారు.
కేంద్రం మాత్రం జమిలి ఎన్నికలపైనే ఫోకస్ పెట్టింది. కానీ జగన్ ముందస్తుకు వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నారు. దాంతో జగన్ నిర్ణయానికి కేంద్రం అంగీకరిస్తుందా..? అనేది బిగ్ డిబేట్ గా మారింది. ఒకవేళ కేంద్రమే ముందస్తుకు వెళ్తే ఏపీ కూడా ముందస్తుకు వెళ్లే అవకాశం ఉంది. మొత్తంగా కేంద్రం నిర్ణయం ఆధారంగా జగన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read : చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్ – టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు..!?