బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ ఉద్యమానికి ఇక దారులు మూసుకుపోయినట్లే. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఏడుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. దాంతో 33% మహిళా రిజర్వేషన్ కోసం తెలంగాణ భవన్ ఎదుట ధర్నా చేయగలవా కవిత అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం.. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కవిత గతంలో ధర్నా చేపట్టింది. ఉద్యమకారులకు, మేధావులకు లేఖలు రాసింది. ఇప్పుడు కవిత డిమాండ్ ను ఆమె తండ్రి కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేసినట్లుగా అయింది.
గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ పిలిచిందనే మహిళా రిజర్వేషన్ రాగం అందుకుందని కవితపై విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలోనే ఆమె మహిళా రిజర్వేషన్ పై తన పోరాటం కొనసాగుతున్నందుకే ఈ విధమైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. కొంతకాలంగా ఆ కేసులో ఎలాంటి కదలికలు లేకపోవడంతో మహిళా రిజర్వేషన్ పై పోరాటాన్ని కూడా మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు అందరి దృష్టి కవిత మహిళ రిజర్వేషన్ ఉద్యమంపై నెలకొంది. కేవలం ఏడు సీట్లు మాత్రమే మహిళలకు కేటాయించిన దరిమిలా ఈ విషయంపై కవిత తన తండ్రిని నిలదీయగలదా..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ప్రతి ఒక్కరికి మహిళా బిల్లు రాజకీయంగా ఉపయోగపడుతోంది. వాజ్ పేయి హయాంలో సీపీఐ ఎంపీ గీతాముఖర్జీ మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసి పార్లమెంట్ కు రిపోర్ట్ ఇచ్చారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించాయి. తరువాత ఏర్పడిన ప్రభుత్వాలకు పూర్తిస్థాయి సంఖ్యాబలం లేదు కానీ మోడీకి పూర్తిబలం ఉంది. ఈ బిల్లును ఆమోదించేందుకు మోడీ సర్కార్ కు అనాసక్తి చూపుతోంది. దాంతో కవిత పోరాటానికి దేవ్యాప్తంగా బీజేపేతర పక్షాలన్నీ మద్దతు తెలిపాయి. కానీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తోన్న పార్టీనే మహిళలకు తక్కువ సీట్లు కేటాయించడంతో కవిత వైఖరిపై అందరి దృష్టి పడింది.
Also Read : కేసీఆర్ ను తలదన్నేలా పట్నం మహేందర్ రెడ్డి వ్యూహం..!?