బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్థుల జాబితా ప్రకటన సందర్భంగా కేసీఆర్ ఓ ఎమ్మెల్సీ పేరు ప్రస్తావించడం పట్ల ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నెత్తిన శనిని మోపేందుకు కేసీఆర్ ఆ ఎమ్మెల్సీకి కీలక పదవిని ఆఫర్ చేశారా..? అని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరవర్గం అనుమానిస్తోంది.
పట్నం మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయనకు ప్రాధాన్యత కల్గిన పదవిని ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని సమాచారం. ప్రస్తుత ప్రభుత్వానికి మరో మూడు నెలల గడువు మాత్రమే ఉంది. ఆ తరువాత బీఆర్ఎస్ గెలిచినా పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఉండేది అనుమానమే. ఈ క్రమంలోనే ఈ మూడు నెలల కోసం పదవి చేపట్టడం ఎందుకని పట్నం వర్గీయులు ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. “నేను చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది.. చూస్తుండండి.. మంత్రి పదవి అండతో నేనేం చేస్తానో అంటూ” పట్నం తన అనుచరులకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
ఎందుకంటే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన నాటి నుంచి పట్నం ప్రాధాన్యత బాగా తగ్గింది. పట్నం మహేందర్ రెడ్డిని ఉద్దేశించి పైలెట్ రోహిత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినా అధిష్టానం పైలెట్ ను పిలిచి మందలించలేదు. తాండూర్ లో బీఆర్ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మహేందర్ రెడ్డి లక్ష్యంగా పైలెట్ పదునైన పదజాలంతో నోరు పారేసుకున్నారు. “పాతికేళ్ల పాటు తాండూరును పాలించిన ఓ మరుగుజ్జు మాజీ మంత్రి ఏం చేశాడని మళ్లీ మీ ముందుకు వస్తున్నాడు” అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. “పట్నం ఔట్ డేటెడ్ లీడర్ అంటూ చులకన భావంతో కామెంట్స్ చేశారు. వీటన్నింటిపై కేటీఆర్ కు పట్నం ఫిర్యాదు చేసినా పైలెట్ రోహిత్ ను నోరు అదుపులోకి ఉంచుకోవాలని వార్నింగ్ కూడా ఇవ్వలేదు.
ఇవన్నీ మనస్సులో పెట్టుకున్న మహేందర్ రెడ్డి… అదును చూసి పైలెట్ ను దెబ్బకొట్టేందుకు రెడీ అయిపొయాడు. మంత్రి పదవి ద్వారా పైలెట్ రోహిత్ రెడ్డికి చుక్కలు చూపిస్తానని..ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి తనను, తన వర్గీయులను ఎంత టార్చర్ చేశాడో.. మంత్రి పదవి ద్వారా పైలెట్ ను అంతకుమించి టార్చర్ చేస్తానని అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
“ఎన్నికల నాటికి పైలెట్ కు మద్దతు ఇచ్చే ఏ ఒక్క లీడర్ ను వదిలిపెట్టను, “30 ఏళ్ల నా రాజకీయ అనుభవాన్ని చులకన చేసినందుకు నా అనుభవాన్ని ఎలా వాడుతానో చూడండి”. “పట్నం మహేందర్ రెడ్డితో రాజకీయ వైరం పెట్టుకుంటే ఎలా ఉంటుందో.. ఇప్పుడు చూస్తారు” అంటూ తన ఆక్రోశాన్ని , ఆవేదనను పట్నం మహేందర్ రెడ్డి వెళ్ళగక్కినట్లు టాక్ నడుస్తోంది. అలాగే, నాలుగేళ్ళు తనను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఎన్నికల వేళ.. కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు తెలియగానే మంత్రి పదవిని ఆఫర్ చేశారని..అందుకుగాను బీఆర్ఎస్ కు కూడా అదిరిపోయే గిఫ్ట్ ఇస్తానని అన్నట్లు చెబుతున్నారు.
సరిగ్గా నామినేషన్ వేసే ఒకరోజు ముందు కాంగ్రెస్ లో చేరుతానని పట్నం మహేందర్ రెడ్డి తన మదిలో మాటను సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా తనను క్షోభకు గురి చేసినా కేసీఆర్ అండ్ కో కు గట్టి బుద్ది చెప్పేందుకు పట్నం ప్రణాళిక బద్దంగా సాగుతున్నారని అంటున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో..!!
Also Read : హోల్ సేల్ గా తొలివెలుగు ను టీఆర్ఎస్ కు అమ్మేసిన రవిప్రకాష్..!!