ఎనక నుంచి ఏనుగులు పోయినా పర్వాలేదు. కానీ ముందు నుంచి ఎలుకలు పోరాదు అన్నట్లు ఉంది మన దేశ పరిస్టితి. నేరాలు – ఘోరాలు జరిగి దేశం అల్లకల్లోలం అవుతుంటే పట్టించుకోని బిజెపి నాయకులు చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకుని, పోలీసు కేసులు పెట్టి, కోర్ట్ ల చుట్టి తిరుగుతున్నారు.
ఇటు దక్షణ సినిమాలతో పాటు, అటు హిందీ సినిమాలల్లో కూడా బిజీగా ఉన్న ప్రముఖ హీరోయిన్ తాప్సి మొన్న ముంబాయి లో జరిగిన ‘లాక్మే ఫ్యాషన్ షో’ లో మోడలింగ్ చేశారు. మోడలింగ్ అంటేనే పలుచని గౌనులు, అర్థ నగ్న దుస్తులు తప్పక ధరించాలి. మోడలింగ్‌లో అమ్మాయిలు తమ అందాలను ఆరబోయకపోతే ఎవ్వరు చూడరు. ఆ బ్రాండ్ ఉత్పత్తికి గిరాకి పెరగదు. అది అందరికి తెలిసిన కిటుకే. ఇది కాదు బిజెపి నాయకుల బాధ.
బిజెపి ఏమ్మెల్లె మాలిని ముద్దుల కొడుకు, యువకుడు ఏకలవ్య గౌర్. అతను కూడా బిజెపి యువజన నాయకుడు. ఆ షో లో ఎందుకు పాల్గోన్నదో అతనికే తెలియాలి. మొత్తానికి చొంగ కారుస్తూ అందులో పాల్గొన్నాడు. అతని కన్ను మాత్రం తాప్సి మేడలో వేసుకున్న బంగారు గొలుసు మీద పడింది. ఆ గొలుసుకు వేలాడుతున్న చిన్న లాకెట్ మీద పడింది. ఆ లాకెట్ మీద ఉన్న లక్ష్మీ దేవి బొమ్మ మీద పడింది. అంతే!
అలాంటి అర్థ నగ్న ప్రదర్శనలో తాప్సి మెడలో లక్ష్మీ దేవిని ధరించి ఓ మతాన్ని కించపరిచారని అరిచాడు. దీనివలన ఓ మతం మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఆ షో ను వెంటనే ఆపేశాడు. ఆమె మరో మతానికి చెందింది. కాబట్టి ఇతరుల మతాలను కించ పరుస్తోంది అని ఆరోపించారు. ఆమెను స్టేజి మీదే బూతులు తిట్టాడు.
ఆ గొలుసు తన లక్కి గొలుసనీ, అది చిన్నప్పటినుంచి వాడుతున్నట్లు, అది బంగారు గోలుసని తాప్సి ఎంత చెప్పినా అతను వినలేదు.
అతను వెంటనే ఛత్రపుర పోలీస్ స్టేషన్ లో ఆమె మీద మతకలహాల క్రిమినల్ కేసు పెట్టాడు. ఇంకే! బిజెపి కార్యకర్తలు ఆ పోలీస్ స్టేషన్ మీద దండయాత్ర చేసి ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలనీ హోరెత్తించారు. మతకలహాల కింద ఆ కేసును నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు.