మట్టి పిసికిన చేతులతో బంగారాన్ని పిసికే మహామనిషిని ఏమంటారు?
ఇంకే మంటారు – తోట రామ్ కుమార్ అంటారు.
గన్ పట్టాల్సిన చేతులతో పెన్ పట్టిన మేధావింది ఏమంటారు?
ఇంకే మంటారు – తోట రామ్ కుమార్ అంటారు.
దేశం కానీ దేశంలో రొడ్ల మీద తిరిగి, ఆ దేశాని ఏలుతున్న గొప్ప వ్యాపారిని ఏమంటారు?
ఇంకే మంటారు – తోట రామ్ కుమార్ అంటారు.
నాడు ఒకడి దగ్గర అన్నం తిన్నవాడు, నేడు వేలాదిమందికి అన్నం పెట్టేవాడిని ఏమంటారు?
ఇంకే మంటారు – తోట రామ్ కుమార్ అంటారు.
ఇంతకీ ఎవరి తోట రామ్ కుమార్?
నిన్నటివరకు ఎవ్వరికి తెలియని పేరు. నేడు అందరికి తెలిసిన పేరు. ఇక్కడే కాదు – దుబాయ్ లో కూడా అందరికి తెలిసిన పేరు. దుబాయ్ లోని అధిక సంపన్నుల్లో ఒకడు.
తెలుగు వాళ్ళ కీర్తి పతకాని దుబాయ్ లో ఎగరేసిన ఓ వ్యాపార మహాత్ముడు. తోట రామ్ కుమార్ మా తెలంగాణ ముద్దు బిడ్డ, మా తెలుగు వాడు, మా భారతీయుడు అని గర్వంగా చెప్పుకునే స్టాయికి ఎదిగిన కలియుగ అపర కుబేరుడు.
ఇంత గొప్ప పేరు ఒక్క రోజుతో వచ్చింది కాదు. ఒక లాటరి టికెట్కా కొంటే వచ్చింది కానేకాదు. దీనివెంక చాలా కృషి, పట్టుదల, కఠోర శ్రమ దాగి ఉంది. ఆమె ఏమిటో తెలుసుకోవాలని అంటే అంతని జీవితం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. కాలాని రివైండ్ చేయాలి.
అది పూర్వం కరీంనగర్ జిల్లా వేములవాడ. ఓ మిడిల్ క్లాస్ లో పుట్టారు తోట రామ్ కుమార్. తండ్రి తోట నారాయణ, నరసమ్మ. వాళ్లు పెద్దగా చదువుకోలేదు. వ్యవసాయ కుటుంబం. అతికష్టం మీద రామ్ కుమార్ పదో తరగతి వరకు వేములవాడలో చదువుకున్నారు. పై చదువులు చదవాలి అనుకున్నారు. కానీ పదిలో ఫెయిల్ అయ్యారు. అందరు నవ్వారు. కించ పరిచారు. ఎందుకు పనికిరాదు అని ఎద్దేవా చేసారు.
ఏ పని చేయలేని నునులేత మీసాల లేత వయసు. అప్పటికే కరీంనగర్ ‘అన్నల’ కనుసన్నల్లో ఉంది. నిరుద్యోగులు, చదువులో, జీవితంలో ఫెయిల్ అయ్యిన వాళ్ళ చేతికి అన్నలు గన్నులు ఇచ్చి అడవిలోకి ఆహ్వానిస్తున్న రోజులు. అయినా రామ్ కుమార్ గన్నును నమ్ముకోలేదు. పెన్నును నమ్ముకున్నారు. గన్నుల మీద మన్ను కప్పితే పెన్నులై మొలకెత్తాలి అనుకున్నారు.
కస్టపడి పదో తరగతి పాసయ్యారు. ఇక చవించే స్తోమత ఇంట్లో లేదు. అందుకే 1989లో స్నేహితులతో కలిసి దుబాయ్ లో కూలి పని చేసేందుకు బయలు దేరారు. అప్పుడు అతని దగ్గర ఉన్నవి రెండు పాత డ్రెస్ లు మాత్రమే. వేసుకోడానికి రెండో బనియన్ కూడా లేని దీనస్తితి.
దుబాయ్ కి వెళ్ళాక కూలిపని ఎలా చేయాలో కూడా తెలియని అమాయకత్వం. మట్టి పిసికారు. ఇటుకలు మోసారు. బస్తాలు ఎత్తారు… దుబాయ్ రొడ్ల మీద దిక్కులేని దీనుడిగా తిరిగారు. తన తల్లి చెప్పిన మాటలు చేవులల్లో ఎప్పుడు తిరిగేవి ‘బిడ్డా, బతకడం అంటే మనం తినడం కాదు, పదిమందికి తిండి పెట్టడం’ అని. కానీ ఎలా?
ఆ పదో తరగతి చదువుతో అంతకు మించి ఏమి చేయగలరు? జీవితంలో పైకి రావాలంటే కండబలం కాదు, చదువు బలం ఉండాలి అనే చిన్న లాజిక్ పట్టుకున్నారు. కూలి, నాలి చేస్తూ పార్ట్ టైములో చదవడం మొదలు పెట్టారు. ఓ కంపనిలో అకౌంటెంట్ గా చేరారు. సిఏ వరకు చదివారు. అక్కడినుంచి అతని జీవితం కొత్త మలుపు తిరిగింది.
అదాని గ్రూప్ లో పెట్రో కేమికాల్ విభాగం అధిపతి యోగేష్ మెహరా దగ్గర సేల్స్ మేనేగర్ గా చేరారు. అయన దగ్గర పాఠాలే కాదు గుణపాఠాలు కూడా నేర్చుకున్నారు. యోగేష్ మెహరా కష్టపడే దాంట్లో పదోవంతు కష్టపడినా గొప్పవాడిగా మారవచ్చు అని అక్కడే నిర్ణయించుకున్నారు. ఉద్యోగం కంటే వ్యాపారం ఉత్తమం అనుకున్నారు.
అందుకే బయటికి వచ్చి 2004 లో ఓ మిత్రుడితో కలసి వ్యాపారం మొదలు పెట్టారు. అంతకుముందు దుబాయ్ లోని పలు కంపెనీల అధిపతులతో, డైరెక్టర్లతో స్నేహం ఉండేది. దానిని తనకు అనుకూలంగా వాడుకోవాలి అనుకున్నారు. అప్పటికి దుబాయిలో భావన నిర్మాణం విప్లవం వచ్చింది. తనకు తెలిసిన బిల్డింగ్ మెటిరియాల్ ట్రేడింగ్ గురించి బాగా అద్యాయనం చేశారు. తన దగ్గర ఉన్న డబ్బుతో, ఓ స్నేహితుడి తో కలిసి బ్యాంకులో లోన్ తీసుకుని బిల్డింగ్ మెటిరియాల్ ట్రేడింగ్ వ్యాపారం మొదలు పెట్టారు. ఈ కంపెనీ పేరు ‘టోటల్ సొల్యూషన్స్’. అది లాభల బాటలో దూసుకుపోయింది. స్నేహితుడితో విబేధాలు వచ్చాయి.
ఇక ఒక్కరే 2007 లో ప్రయాణం మొదలు పెట్టారు. శ్రీ రాజ రాజేశ్వర ట్రేడింగ్ కంపెనీ మొదలు పెట్టారు. పెద్ద పెద్ద బిల్డింగ్, కమర్షియల్ కాంప్లెక్స్, వంతెనల నిర్మాణానికి మేటీరియల్ సరఫరా చేసి అంచెలంచలుగా ఎదిగారు. తాను ఏదుగుతూ, తన చుట్టూ ఉన్నవారిని ఎదిగేలా చేశారు. తాను తింటూ, పదిమందికి తినిపించడం నేర్చుకున్నారు. మన తెలుగు భాషన్నా, తెలంగాణ యాస అన్నా, తెలుగు సంప్రదాయం మక్కువ ఎక్కువ. అందుకే గత పన్నెండు ఏళ్లుగా దుబాయ్ లో బతుకమ్మ పండగ చేసుకుంటారు. ఏ పండగను వదలరు. దుబాయ్ లో తెలుగు సంప్రదాయం వేలిసేలా చేశారు. తెలుగు వాళ్ళను, భారతీయులను ఏకం చేశారు.
తోలి ఏడాది 200 కోట్ల రూపాయలు సంపాదించి దుబాయ్ షేకుల దృష్టిలో పడ్డారు. అప్పటినుంచి దుబాయ్ లోని అంతర్జాతీయ సివిల్ కాంట్రాక్టు ఇంజనియర్ కంపెనీలు అయన దగ్గర మేటిరియాల్ కొనసాగారు. ప్రపంచంలోనే ఎత్తయిన ‘బూర్చ్ కలిఫా బిల్డింగ్’ కి మేటిరియాల్ అందించిన ఘనత సాదించిన చరిత్ర కారుడు.
తాజా మహల్ నిర్మాణానికి రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవ్వరో మనకు తెలియదు. కానీ ప్రపంచలోనే ఎత్తయిన ‘బూర్చ్ కలిఫా బిల్డింగ్కు’ మేటిరియాల్ అందించిన ఘనత మన మన తెలుగు తేజం, భారతమాత ముద్దుబిడ్డ తోట రామ్ కుమార్ కే శాశ్వతంగా దక్కింది.