పరువునష్టం కేసులో దోషిగా తేలిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది లోక్ సభ సెక్రటేరియట్. రెండేళ్ళ జైలు శిక్షను సూరత్ కోర్టు విధించడంతో ఈ తీర్పు ఆధారంగా రాహుల్ పై చర్యలకు ఉపక్రమించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో రెండేళ్లు అంతకుమించి శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు అనర్హత వేటుకు గురవుతారు. అంతేకాదు శిక్షకాలం ముగిసాక ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోతారు.
అయితే ఇలాంటి శిక్షలు పడడం భారతదేశంలో కొత్త కాదు. ఇలాంటి కేసులను గతంలో చాలామంది నేతలు ఎదురుకున్నారు. అయితే వీళ్ళందరూ నేరాలు – ఘోరాలు చేసిన వారు. కానీ రాహుల్ గాంధీ ఒక్కడే ఎలాంటి నేరం చేయకుండా కేవలం ఓ రాజకీయ విమర్శ చేసి ఈ కేసులో ఇరుక్కున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు అనర్హతవేటుకు గురైన ప్రజా ప్రతినిధులు చాలామందే ఉన్నారు. వారిలో ప్రముఖ నేతలు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆజమ్ ఖాన్
ఆజమ్ ఖాన్ మత ద్వేషాలు రెచ్చగొట్టినందుకు ఆయనకు 2022 అక్టోబర్ లో మూడేళ్ళ జైలు శిక్ష పడింది. అప్పుడు కూడా అతని అసెంబ్లీ సభ్యత్వం మీద వేటుపడింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి మత ద్వేషాలు రెచ్చగొట్టలేదని గమనించాలి. మోడీ అనే ఇంటిపేరుతో రాహుల్ చేసిన వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకొని…మోడీలు అందరు ఏకమై రాహుల్ గాంధీని చట్టం చేతిలో ఇరికించారు. దీని వెనక ప్రధాని మోడీ హస్తం ఉన్నదని చెప్పవలసిన అవసరం లేదు.
లాలూ ప్రసాద్ యాదవ్
ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో కొన్ని కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అది రుజువయింది. 2013 సెప్టెంబర్ లో ఆయన అవినీతికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. దాంతో అప్పుడు బీహార్ లోని సరన్ నియోగక వర్గానికి ఎంపి గా ఉన్న అతని మీద అనర్హత వేటు పడింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి కుంభకోణం చేయలేదు అని ఇక్కడ మనం గమనించాలి.
జయలలిత
నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని కోర్టు రుజువు చేసి 2014 సెప్టెంబర్లో ఆమెకు జైలు శిక్ష విధించింది. అప్పుడు కూడా ఆమెకు అసెంబ్లీ సభ్యురాలిగా అనర్హత వేటు పడి, సిఎంగా గద్దె దిగింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి అక్రమ ఆస్తులు సంపాదించలేదు అని గమనించాలి.
మొహమ్మద్ ఫైజల్
ఓ హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ ను 2023 జనవరిలో కోర్ట్ దోషిగా తేల్చింది. అతని మీద కూడా పార్లమెంట్ సభ్యత్వం మీద వేటుపడింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి హత్యలకు పాల్పడలేదు అని గమనించాలి.
అనిల్ కుమార్ సాహ్ని
మోసం చేసిన కేసులో ఇతనికి 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీనితో బీహార్ అసెంబ్లీ నుంచి అనర్హత వేటు పడింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి మోసాలకు పాల్పడలేదు అని గమనించాలి.
విక్రమ్ సింగ్ సైని
విక్రమ్ సింగ్ సైని ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో కోర్ట్ దోషిగా తేల్చి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతని మీద కూడా అసెంబ్లీ సభ్యత్వం మీద వేటుపడింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి అల్లర్లకు పాల్పడలేదు అని గమనించాలి.
ప్రదీప్ చౌదరి
దాడి కేసులో ప్రదీప్ చౌదరికీ 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతని మీద కూడా అసెంబ్లీ సభ్యత్వం మీద వేటుపడింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి దాడులకు పాల్పడలేదు అని గమనించాలి. ఇలా చెప్పుకుంటూ పొతే చాలామంది ఉన్నారు.
అనంత్ సింగ్:
బిహార్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే. ఆయుధాల కేసులో శిక్షతో జులై 2022లో శాసనసభ సభ్యత్వానికి దూరమయ్యారు. కానీ రాహుల్ గాంధీ ఆయుధాల కేసులో శిక్ష ఎదుర్కోలేదనే సంగతి గుర్తించాలి.