కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకే గుండె పోటు అధికంగా వస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చిందని సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు గురువారం ఓ నివేదిక విడుదల చేశారు. ఈ నేపద్యంలో కోవిడ్ వచ్చి తగ్గినవారిలో వైరస్ ప్రభావం ఇంకా పోనట్లు తెలిసింది. గుండె రక్తనాలాల లోపలి పొరల్లో (ఎండోతేలియం) ఈ వైరస్ నిద్రావస్తలో ఉండటం వల్ల కొందరికి గుండెపోటు వస్తున్నట్లు పరిశోధనలో ప్రాథమికంగా తెలిసినట్లు అయన చెప్పారు. కోవిడ్ వచ్చి తగ్గిన అన్ని వయసువల్లలో ఈ గుండెపోటు లక్షణాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇదే ఆందోళన కలిగించే విషయం.
దీని నివారణ చర్యలు
అందుకే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ విడుదల చేసిన అడ్వైసరి (సలహా మండలి) లో యువతీ యువకులు కూడా వెంటనే గుండె పరిక్షలు చేయించుకోవాలని సూచించారు. 18 నుంచి 40 ఏళ్ళు వచ్చి, లోగడ కరోనా సోకి తగ్గిన వాళ్ళు ప్రతి ఆరు నెలలకు కనీసం ఒక్కసారైనా బిపి చెక్ చేయించుకోవాలి.
మీలో కొలస్త్రాల్ ఎంత ఉందో ముందుగా తెలుసుకు కోవాలి. ఎక్కువ కొలస్త్రాల్ ఉన్నవాళ్ళు వెంటనే గుండె వైద్య నిపుణులను కలవాలి.
దీనికి తోడూ ఎప్పటికప్పుడు మధుమేహం (షుగర్) లెవల్ ప్రతి నెల చెక్ చేసుకోవాలి. ఇది చాప కింది నీరులా కొంపలు ముంచుతుంది. షుగర్ ఎక్కువున్న వాళ్లు కూడా వెంటనే గుండె వైద్య నిపుణులను కలవాలి.
యువతి, యువకులు భోజనం విషయంలో కట్టుదిట్టంగా ఉండాలి. పళ్ళు, బీన్స్, ఆకు కూరల ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా కొవ్వు తక్కువ ఉండే ఆహారం మాత్రమే తీసుకోవాలి. పాల మీద, పెరుగు మీద ఉండే మీగడ లేకుండా చూసుకోవాలి. పిజ్జా, బర్గర్ లకు వీడ్కోలు చెప్పాలి. ఉప్పు, కారం, చక్కర, కార్బో హైట్రేడ్, మద్యం, మత్తు మందులకు దూరంగా ఉండాలి.
రోజుకు ఓ అరగంట యోగ, లేదా ఏరోబిక్, వాకింగ్ లాంటి వ్యాయామాలు తప్పనిసరి చేయాలి. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వాళ్ళు వెంటనే తమ బరువు తగ్గించుకోవాలి. మీ ఎత్తుకు తగినంత బరువే ఉండాలి. బరువు తగ్గడంవల్ల షుగర్, కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.
రోజుకు కనీసం 5 లీటర్ల మంచి నీళ్ళు తాగాలి.
కంటి నిండా నిదురపోవాలి. రోజు క్రమం తప్పకుండా ఒకే సమయానికి పడుకోవాలి, ఒకే సమయానికి నిదుర లేవాలి. కనీసం 8 నుంచి 9 గంటల నిదుర ఉండేలా చూసుకోవాలి.
అన్మానింటికంటే చాలా ముఖ్యమైనది మాన సిక ఒత్తిడిని మీకుగా మీరు తగ్గించుకోవాలి. వీటికి మందులులేవు. మీకు మిరే డాక్టర్ గా మారాలి.
ఇకఇంచి జిల్లలల్లో సిపిఆర్ పై శిక్షణ
రోజు రోజుకు గుండెపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్న దృశ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో సిపిఆర్ పై శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. సిపిఆర్ అంటే కార్డియో-పల్మనరి రిససిటేషన్, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ దిఫ్రిబిలెటర్ (ఎఇడి) లపై శిక్షణ విఇవాలని యోచిస్తోంది. ప్రతి జిల్లాకు కనీసం 4 నుంచి 8 మాస్టర్ ట్రైనర్లను పంపుతున్నారు. ఈ దిశగా రాష్ట్ర ఆరోగ్య శాఖ దృష్టి సారించి పని మొదలు పెట్టింది.