ప్రీతి సంఘటనకు – బండి సంజయ్ కొడుకుకు ముడిపెట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి. బండి భగీరధ్ తను చదువుతున్న కాలేజ్ లో జూనియర్ విద్యార్ధిని ర్యాగింగ్ తో వేధించి చితకబాదిన వీడియో ఆ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రి కేంద్ర పెద్దలు చక్రం తిప్పడంతో బండి సంజయ్ కుమారుడు సేఫ్ జోన్ లోకి వచ్చేశాడు. ఇప్పుడు ప్రీతి మరణానికి ర్యాగింగ్ ఒక కారణం. ఆయన కుమారుడి ర్యాగింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వస్తుంది అనుకుని ఈ కేసును పెడదోవ పట్టించే కుట్ర చేస్తున్నాడు.
సైఫ్ అనే సీనియర్ విద్యార్ధి ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రీతి సంఘటనలో రాజకీయం చేసేందుకు లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ ను బండి సంజయ్ తెరమీదకు తీసుకొచ్చారని అందరు అనుకున్నారు. కానీ బండి సంజయ్ వ్యూహాత్మకంగానే లవ్ జిహాద్ కామెంట్స్ చేసి తన కొడుకును రక్షించుకున్నారన్న విశ్లేషణలు తాజాగా వినిపిస్తున్నాయి.
మెడికో ప్రీతి మరణానికి కారణం ర్యాగింగే. మొదట నుంచి ఆమె తల్లిదండ్రులు ఇదే చెబుతున్నారు. సీనియర్ సైఫ్ వేధింపుల వలనే తమ కూతురు ఆత్మహత్యయత్నం చేసిందని మీడియా ముందే ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ప్రీతిది లవ్ జిహాద్ కేసేనని ప్రకటించడం చర్చనీయాంశం అయింది. అసలు ప్రీతి – నిందితుడు సైఫ్ మధ్య లవ్ అనేదే లేదు. బండి సంజయ్ మాత్రం ర్యాగింగ్ అనే అంశాన్ని వదిలేసి.. లవ్ జిహాద్ ప్రీతి ఆత్మహత్యయత్నంకు కారణమని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రీతి సంఘటనకు ర్యాగింగే ప్రధాన కారణమని బండి సంజయ్ మాట్లాడితే బండి భగీరధ్ ర్యాగింగ్ కేసు తిరగదోడే అవకాశం ఉంది. విచారణ జరిగితే ఇబ్బందులు తప్పవు. పైగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ లకు ఓ రకంగా బండి సంజయ్ ఆయుధం ఇచ్చిన వాడవుతాడు. అందుకే ప్రీతి సంఘటనలో లేని లవ్ అనే కోణాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈ సంఘటనను బీజేపీకి అనుకూలంగా మలుచుకోవాలనుకున్నాడు బండి సంజయ్.
కన్న కొడుకు కోసం పరాయి అమ్మాయి క్యారెక్టర్ ను దెబ్బకొట్టే ప్రయత్నం చేసి..ఈ కేసును మొత్తమే తప్పుదోవ పట్టించే ప్రయత్నం బండి సంజయ్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొడుకు కోసం పరాయి అమ్మాయిపై బట్టకాల్చి మీదేయడం భాద్యతయుతమైన పదవిలోనున్న బండి సంజయ్ లాంటి వ్యక్తి చేయడం ముమ్మాటికీ తప్పేనంటున్నారు విశ్లేషకులు. పైగా ఈ కేసులో లవ్ జిహాద్ అనే ప్రస్తావనే లేదని… సైఫ్ సామాజిక వర్గం చూసి లవ్ జిహాద్ అని ఫిక్స్ అవుతారా అంటూ వరంగల్ సీపీ ప్రశ్నించిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.
బండి సంజయ్ కుమారుడు ర్యాగింగ్ చేసిన ఘటనపై సరైన చర్యలు తీసుకొని ఉండుంటే ప్రీతిలాంటి అమ్మాయిలకు ర్యాగింగ్ వేధింపులు ఎదురయ్యేవి కావని చెబుతున్నారు. ర్యాగింగ్ భూతాన్ని నిరోధించడంలో విఫలం కావడంతోనే ప్రీతి సంఘటన చోటుచేసుకుందని… ఇకనైనా కళ్ళు తెరవకపోతే రేపు ఇంకో ప్రీతి సంఘటన వెలుగు చూసే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు.
బండి సంజయ్ కొడుకు ర్యాగింగ్ కేసును సీరియస్ గా తీసుకొని ఉండుంటే ప్రీతి మరణానికి సైఫ్ కారణం అయ్యేవాడా..? ఆలోచించండి.
Also Read : ప్రీతి కేసులో లవ్ జిహాద్ – బండి సంజయ్ కి కేఏ పాల్ పూనాడా..?