దేశవ్యాప్తంగా నేరారోపణలు, నేర చరిత్ర కల్గిన ప్రజా ప్రతినిధుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) బయటపెట్టింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులలో 59శాతం మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు వారున్నారని పేర్కొంది. తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం 17మంది మంత్రులు ఉన్నారు. అందులో పదిమందిపై కేసులు ఉన్నట్టు ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది.
అత్యధిక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మంత్రులున్న రాష్ట్రం జాబితాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర క్యాబినెట్ లో మొత్తం 20మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 13మంది అంటే 65శాతం మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఆ తరువాత స్థానంలో ఝార్ఖండ్ రాష్ట్రం ఉంది. 11మంది మంత్రులుండగా..ఏడుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది.
తమిళనాడులో33 మంది మంత్రులకు గాను 28మంది (85 శాతం), హిమాచల్ ప్రదేశ్ లో 9 మందికి ఏడుగురు (78 శాతం), మహారాష్ట్రలో 15 మంది మంత్రులు (75 శాతం), పంజాబ్ లో 11 మంది మంత్రులు (73 శాతం), బీహార్ లో 30 మంది మంత్రులకు గాను 21 మంది (70 శాతం) తమ అఫిడవిట్లలో క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు.
ఈ జాబితాను చూస్తుంటే.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని మంత్రివర్గాలు క్రిమినల్స్ కేసులున్న వారితోనే నిండి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలు చట్టసభల్లో ఉండటం వలెనే దేశ రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయి. క్రిమినల్ కేసులో ఇరుక్కున వారు చట్ట సభల్లోకి వెళ్లి చట్ట సవరణలను చేసుకుంటూ తమకు కావాల్సిన చట్టాలను తయారు చేసుకుంటున్నారు. కాబట్టి..నిజాయితీ , నిస్వార్ధంతో ఆలోచించే యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందని ఏడీఆర్ నివేదికను చూస్తె అర్థం అవుతుంది.