ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ కుల, మత వర్గాలకు అతీతంగా సమాన హక్కులుంటాయి. రాజ్యాంగం కూడా ప్రజలకు పెద్దపీట వేసి సార్వభౌమాధికారాన్ని కట్టబెట్టింది. దేశాన్ని లౌకిక, సామాజిక, గణతంత్ర, ప్రజాస్వామ్యంగా ప్రకటించింది. అటువంటి రాజ్యాంగ స్ఫూర్తి నిలవాలని, ప్రజలందరూ రాజ్యాంగబద్ధులై తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆకాంక్షిస్తుంది. కేవలం ఆకాంక్షలకే పరిమితం అవ్వకుండా వాటిని ఆచరణలో పెట్టేందుకు ముందడుగు వేసింది. ముఖ్యంగా యువతే దేశ భవిత కాబట్టి వారిలో రాజ్యాంగ చైతన్యం ఎంతో అవసరమని గుర్తించింది. అందుకు అనుగుణంగా సానా సతీష్ బాబు విద్యాభ్యాసం చేసిన పీఆర్ ప్రభుత్వ కళాశాలలో భారతరత్న డాక్టర్ బాబా సాహెచ్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు తోడ్పాటునిచ్చింది. సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో అందుకు కావాల్సిన విరాళాన్ని సమకూర్చింది. అంతేకాకుండా ప్రముఖుల ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ చేయించింది.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ రూపకర్త. నిమ్న వర్గానికి చెందిన ఆయన విదేశాల్లో అత్యున్నత విద్యలను అభ్యసించే స్వాతంత్య్ర సంగ్రామంలో భాగస్వాములయ్యారు. ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదురైనా ఏనాడూ విధికి తలవంచలేదు. కుల వైషమ్యాన్ని ద్వేషంగా మార్చుకోలేదు. ప్రజలందరూ తరతమ భేదాలకు, ప్రాంతీయ భావనలను, మత మౌఢ్యాలకు దూరంగా ఏకాత్మ భావంతో ఐక్యంగా జీవించాలని కాంక్షించారు. అందుకే కేవలం అణగారిన వర్గాలనే భావన లేకుండా రాజ్యాంగ రూప కల్పనలో ముఖ్య భూమికను పోషించారు. అదే స్ఫూర్తిని సానా సతీష్ బాబు ఫౌండేషన్ అందిపుచ్చుకుంది. కుల, మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బాబా సాహెబ్ అంబేడ్కర్ సాక్షిగా సమ సమాజ నిర్మాణం కోసం సానా సతీష్ బాబు బాటలో పయనిస్తోంది. కేవలం విగ్రహాల ఏర్పాటుకే పరిమితం అవ్వకుండా ఆచరణలో చేసి చూపిస్తోంది సానా సతీష్ బాబు ఫౌండేషన్. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి అవుతోంది.