సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎన్నడైనా కూడా నిర్మాణాత్మక ధోరణినే నమ్ముకుంది. ఎందుకంటే ఏదైనా నాశనం చేయడానికి తక్కువ సమయం పడుతుంది. కానీ దేనినైనా నిర్మించాలంటే చాలా సమయం తీసుకుంటుంది. అందుకోసం ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. లక్ష్యం పట్ల అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓ విత్తనం భూమిలో పెట్టినంతలో చెట్టుగా మారదు. దానికి తగినన్ని నీళ్లు పోస్తే మొలక వస్తుంది. మొలకకు తగిన సూర్యరశ్మి తగలాలి. తగినంత నీరు ఉండాలి. ఆ మొక్క స్వశక్తితో ఎదిగే వాతావరణం కల్పించాలి. అప్పుడు అదొక పెద్ద చెట్టుగా మారుతుంది. అడవిలో చెట్లు పెరిగే వాతావరణం సహజంగానే ఉంటుంది. కానీ తోటల్లో, పంట పొలాల్లో అవే చెట్లు పెంచాలంటే శ్రద్ధ అవసరం అవుతుంది. అప్పుడే పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి, పంటలు పండుతాయి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అదే ఓ ప్రాంతం, ఓ వ్యక్తి ప్రగతి సాధించాలంటే అందుకు అనుగుణమైన వాతావరణం ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి అయినా, ప్రాంతమైన పరిపూర్ణ ప్రగతిని సాధించే వీలు కలుగుతుంది. అటువంటి వాతావరణం కల్పించడమే సానా సతీష్ బాబు ఆశయం. ఆ ఆశయ సాధనే సానా సతీష్ బాబు ఫౌండేషన్ లక్ష్యం.
అందుకే సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రధానంగా మౌలిక వసతులను మెరుగుపరచడం. విద్యార్థులకు చదువును మరింత చేరువ చేయడం, యువతను పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడం, వీధి వ్యాపారుల ఎదుగుదలకు సహకరించడం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వడం, క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించడం, ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడం చేస్తోంది. అందుకు అనుగుణంగా కార్యక్రమాలను రూపుదిద్ది వాటిని ఆచరణలో పెడుతోంది. తద్వారా అన్ని వర్గాలకు అనుగుణమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి సల్పుతోంది. ఎందుకంటే ఏ ప్రాంతానికైనా మానవ వనరులు ముఖ్యమైనవి. ప్రజలు బలంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి కూడా పరుగులు పెడుతోంది. ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రాంతం సుభిక్షంగా మారుతుంది. అందుకే సానా సతీష్ బాబు ఫౌండేషన్ అన్ని వర్గాల సంక్షేమానికి, అభ్యున్నతికి, సాధికారతకు వేదికగా మారుతోంది. కాకినాడ ఉజ్వల భవిష్యత్తు కోసం నిర్విరామ ప్రయాణం కొనసాగిస్తోంది.