భారత రాజ్యాంగ మూల సూత్రమైన ప్రజాస్వామ్యాన్ని మనసా వాచా కర్మనా విశ్వసిస్తారు సానా సతీష్ బాబు. దేశానికి ప్రజలే సార్వభౌమాధికారులనే రాజ్యాంగ స్ఫూర్తిని సానా సతీష్ బాబు ఆచరిస్తారు. ఎందుకంటే దేశానికి అత్యున్నతమైనది భారత రాజ్యాంగమే కాబట్టి. ఆ రాజ్యాంగం ప్రజలే కేంద్రంగా అధికరణలను రూపొందించింది కాబట్టి. వాటిల్లో ప్రజలకు ఉత్తమ పాలనను అందించే విధానాలను పొందుపరిచారు కాబట్టి. ప్రజలకు మేలు చేయాలంటే అంతకంటే గొప్ప మార్గదర్శనం ఉండదని సానా సతీష్ బాబు భావిస్తారు. అందుకే రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని ఆకళింపు చేసుకున్నారు సానా సతీష్ బాబు. ఏ విధంగానైతే రాజ్యాంగం ప్రజలకు పెద్దపీట వేస్తుందో అదే విధంగా సానా సతీష్ బాబు ప్రజల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి పెద్దపీట వేస్తారు. అనుక్షణం ప్రజలకు ఉత్తమమైన సేవలను అందించాలని ఆకాంక్షిస్తూ తన జీవన ప్రయాణాన్ని సాగిస్తుంటారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ వారి జీవితాలకు మార్గదర్శిగా వెలుగొందుతున్నారు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని తన కార్యకలాపాలా ద్వారా ప్రస్ఫుటం చేస్తూ సమ సమాజ నిర్మాణానికి ప్రేరణ కల్పిస్తున్నారు.
భారత రాజ్యాంగం దేశాన్ని ప్రజల శ్రేయస్సు కోసం సార్వభౌమ, సామాజిక, లౌకిక ప్రజాస్వామ్య దేశంగా పేర్కొంది. అంటే ప్రజలే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నారు. సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం, సమాన హక్కులు ఉన్నాయి. మతాలకు అతీతంగా ప్రజలంతా సమానులే అనే స్పష్టమైన సందేశం రాజ్యాంగ పీఠిక ఇస్తోంది. అందుకే ప్రజలే కేంద్రంగా సానా సతీష్ బాబు పనిచేస్తున్నారు. ఆశయాలకు, ఆలోచనలకు ప్రతిబింబంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కులాలకు అతీతంగా ప్రతిఒక్క కాకినాడ పౌరుడి సంక్షేమాన్ని సానా సతీష్ బాబు ఆకాంక్షిస్తున్నారు. పేదలందరికీ అండగా నిలుస్తూ వారి అభ్యున్నతికి చేయూతనిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారి వర్గం, ప్రాంతం అనే భేదం చూపకుండా ఆదుకుంటున్నారు. సమ సమాజ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. ప్రజల మధ్యనున్న అసమానతలను తొలగించేందుకు పనిచేస్తున్నారు. ప్రజల మధ్య మతసామరస్యాన్ని పెంపొందించేందుకు సానా సతీష్ బాబు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతున్నారు. పండుగల వేళ వేడుకల నిర్వహణకు విరాళాలను అందిస్తున్నారు. తద్వారా కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా ఏకతాటి పైకి వచ్చి సోదరభావంతో మెలిగేలా కృషి చేస్తున్నారు. ఇలా ప్రజాస్వామ్య బలోపేతానికి ఏదైతే అవసరమో దానిని తూచ తప్పకుండా ఆచరణలో పెడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ అప్పారావు మాటలను నిజమని నిరూపిస్తున్నారు. కాకినాడ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్య దృక్పథంతో మొక్కవోని దీక్షతో పయనం సాగిస్తున్నారు.