కాలం మారుతున్న కొద్ది చాలా మందిలో నైతిక విలువలు, కనీస సంస్కారం కనిపించకుండా పోతుంటాయి. కనిపెంచిన తల్లిదండ్రులనే కొందరు పిల్లలు భారంగా భావిస్తుంటారు. వారి పట్ల కర్కశంగా వ్యవహరించేవారు కొందరైతే, విదేశాలకు వెళ్లి తమ కన్నవారిని వృద్ధాశ్రమాల్లో వదిలేసేవారు ఇంకొందరు. ఇలా పేగు బంధమే కానకుండా పోతున్న పెద్దలకు తానున్నాను అనే నమ్మకాన్ని ఇస్తున్నారు సానా సతీష్ బాబు. పెరుగుతున్న కొద్ది వృద్ధులే పిల్లలు అవుతారనే మాటను తన చేతలతో నిజం చేస్తున్నారు. పిల్లలను చూసుకున్నట్లుగా వయసు పెరిగిన పెద్దలను చూసుకునేందుకు వృద్ధాశ్రమాలకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తున్నారు.
కాకినాడలోని జనావళి వృద్ధాశ్రమంలో పదుల సంఖ్యో పెద్దలు ఉంటున్నారు. వారందరికీ చిన్న చిన్న వసతుల సమస్యలు. ఎందుకంటే బిడ్డలే పట్టించుకోవట్లేదు, తమను ఆత్మీయంగా పలకరించే వారూ లేరు. అంత పెద్ద సమస్యల ముందు వసతుల లేమి చిన్న సమస్యే. కానీ బాధకు అరకొర వసతుల చిరాకు తోడైతే అది మరింత భావోద్వేగానికి గురి చేస్తుంది. ముదసరి పసి మనసులను ఇబ్బంది పెడుతుంది. రామా.. నాకు ఈ కష్టమేలరా అనిపిస్తుంది. అందుకే ఆ పెద్దలు ఇబ్బంది పడొద్దని సానా సతీష్ బాబు ముందుకొచ్చారు. వారికి కన్నబిడ్డల ఆత్మీయతను కొంత మేరైనా పంచే ప్రయత్నం చేశారు. అందుకోసం సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా వారికి సహాయం చేశారు. కుర్చీలు, బల్లలు, బక్కెట్లు, ఫ్యాన్లు, ఇతర ఫర్నిచర్ వంటి వసతులను కల్పించారు. వారి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి చిరు నవ్వులు పూయించారు.
సానా సతీష్ బాబు చేసిన సహాయానికి వృద్ధాశ్రమంలోని పెద్దలంతా ఆనందం వ్యక్తం చేశారు. తమకు కనీస వసతులను కల్పించి, మనసుకు సంతోషాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వంద మాటల కన్నా చిన్న సహాయమే ఎంతో గొప్పదని చెప్పారు. అంతేకాకుండా సానా సతీష్ బాబుకు తమ ఆశీర్వాదాలను అందించారు. ఇది కేవలం ఓ వృద్ధాశ్రమానికి సంబంధించిన కథ మాత్రమే. ఇలా ఇంకెన్నో గుప్తంగా చేస్తున్నారు, చేస్తుంటారు సానా సతీష్ బాబు. కేవలం వృద్ధాశ్రమాలకే కాదు పెద్దలు కష్టాల్లో