వైద్యం ఈ కాలంలో పేదలకు అందనంత ఖరీదుగా మారింది. చాలా మంది తమ పేదరికం కారణంగా వైద్యాన్ని ఖరీదు చేసే పరిస్థితి లేదు. అంతటి ఖరీదైన వైద్యాన్ని పొందలేక అవస్థ పడే ప్రాణం కొందరిదైతే, అలసిసొలసి శ్వాస విడిచే ప్రాణం ఇంకొందరిది. ఇలా ఎంతో మంది పేదలు, ఆర్థిక స్థోమత సన్నగిల్లిన వారు నాణ్యమైన వైద్యానికి దూరమవుతారు. అందులో క్యాన్సర్ తో బాధపడేవారు, ప్రమాదకరమైన వ్యాధులబారిన పడినవారు పడే బాధ వర్ణణాతీతం. అసలెందుకు తమకు ఈ బాధలు అన్నంతగా ఆవేదనకు గురవుతారు. అటువంటి అభాగ్యుల దీన స్థితిని చూసి చలించిపోయింది సానా సతీష్ బాబు ఫౌండేషన్. వారిని అనారోగ్యం నుంచి బయటపడేలా చేసేందుకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. వారికి వైద్యానికి అవసరమైన మందులను అందించి అండగా నిలుస్తోంది.
అందుకు ఈ చిన్న సహాయం అద్దం పడుతుంది. కాకినాడకు చెందిన షేక్ మస్తాన్ వలీ భార్య సాధియా షేక్ ఛాతీ సంబంధిత క్యాన్సర్, హెమటోమా వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నారు. భర్త కోవిడ్ సమయంలో మరణించారు. దీంతో ఇంటిని నడపడం భారంగా మారింది. పై నుంచి అనారోగ్యం మరింత బాధపెట్ట సాగింది. ఆర్థిక ఇబ్బందులు ఓ వైపు, అనారోగ్యం మరోవైపు ఆమెను కష్టాల కడలిలోకి నెట్టాయి. నాణ్యమైన వైద్యం పొందడం కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం సానా సతీష్ బాబు ఫౌండేషన్ దృష్టికి వచ్చింది. వెంటనే మానవతా దృక్పథంలో ఫౌండేషన్ స్పందించింది. ఆమె వైద్యంలో భాగంగా అయ్యే మందుల కొనుగోలు కోసం రూ.10వేలను ఆర్థిక సహాయంగా అందించి అండగా నిలిచింది.
అది మాత్రమే కాదు కాకినాడ రామారావు పేటకు చెందిన పెరాలసిస్ పేషంట్ మల్లిపూడి భాస్కర్ లక్ష్మి రమణ కుమారి వయసు 65ఏళ్లు. ఆమె చాలా కాలంగా పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబ ఆర్థిక స్థోమత కూడా అంతంత మాత్రమే. దీంతో ఆమెకు వైద్యం చేయించడానికి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడేవారు. విషయం తెలుసుకున్న సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు సత్వరమే స్పందించారు. రమణకుమారికి 4 నెలలకు సరిపడ