ఇండియాలోని ప్రముఖులకు, రాజకీయ నేతలకు ఐదు కేటగిరీల వారీగా భద్రత ఉంటుంది. ఇందులో కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ నేతలు ఉంటారు. వ్యక్తులు చేసే పని లేదా ప్రజాదరణ కారణంగా వారి జీవితాలు ప్రమాదంలో ఉన్న గుర్తింపు పొందిన వ్యక్తులకు భద్రతా కవర్ అందించబడుతుంది. ఇంటలిజెన్స్ వర్గాలు అందించే సమాచారాన్ని బట్టి వివిధ రకాల భద్రతలను సరఫరా చేస్తారు.
z+ కేటగిరి భద్రత : రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, సీఎంలు, కేంద్ర కేబినెట్ సభ్యులకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తారు. ప్రముఖులు ఎవరికైనా ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తే జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తారు. 10 మంది కమాండోలు సహా 55 మంది సిబ్బంది ఉంటారు. 5+ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. నెలకు రూ.33 లక్షల ఖర్చవుతుంది.
Z కేటగిరి భద్రత: జడ్ కేటగిరీ ఉన్నవారికి 22 మంది రక్షణగా ఉంటారు. ఈ కేటగిరీలో వారికి ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ జవాన్లు, అధికారులను సెక్యురిటీగా నియమిస్తారు. బుల్లెట్ ఫ్రూఫ్ సహా 5 వాహనాలు ఉంటాయి. నెలకు రూ.16 లక్షల ఖర్చు అవుతుంది.
Y+ కేటగిరి భద్రత: 11 మంది సిబ్బంది రక్షణగా ఉంటారు. 2-3 వాహనాలుంటాయి. నెలకు రూ.15 లక్షల ఖర్చవుతుంది.
Y కేటగిరి భద్రత: 1-2 కమాండోలు సహా 8 మంది సిబ్బంది ఉంటారు. 1-2 వాహనాలుంటాయి. నెలకు రూ. 12 లక్షలు ఖర్చు అవుతుంది.
Also Read : పుట్టుకల్ని ప్రశ్నించే స్థాయికి దిగజారిన తెలంగాణ రాజకీయం..!!