ప్రేమించడం తప్పా..? కానే కాదు. ప్రేమ పేరుతో వంచించడమే తప్పు. ఇది మనసుకు గాయం చేస్తుంది. చాలా కాలంపాటు మనసుకు గుచ్చుకుంటూనే ఉంటుంది. ప్రాణాలు బలితీసుకునేలా ప్రేరేపిస్తుంది. ఇలా ఓ యువకుడు ప్రేమలో మోసపోయానని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణమేంటో సూసైడ్ లెటర్ లో ప్రస్తావించాడు. ఈ విషాదకర ఘటన విజయవాడలో జరిగింది.
విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని సూసైడ్ లెటర్ లో రాశాడు. తనను ప్రేమించిన యువతిలో మార్పు రావడంతో.. ఆ మార్పుకు కారణమేంటని ఆరా తీస్తే షాకింగ్ నిజాలు తెలిసాయని వాపోయాడు.
పెళ్ళైన వ్యక్తితో న్యూడ్ కాల్స్ చేస్తూ రిలేషన్ ఉందని రాసుకొచ్చాడు. ఈ విషయం తెలిసి తాను మానసికంగా చాలా బాధపడ్డానని పేర్కొన్నాడు. తనను మార్చేందుకు చాలాసార్లు ప్రయత్నించానని అయినా, తనలో కించిత్ మార్పు లేదని రాశాడు. ఆ అమ్మాయి చేసిన మోసానికి చదవుపై సరిగా దృష్టిపెట్టలేక తనలో తనే సతమతం అవుతున్నానని సలాం పేర్కొన్నాడు.
న్యూడ్ కాల్స్ చేయడం మానేసి చక్కగా ఉందామని ఎంత చెప్పినా వినలేదని సూసైడ్ లెటర్ లో రాశాడు. తనను కాలక్షేపం కోసం ప్రేమించి పిచ్చివాడ్ని చేసిందన్నాడు. ఈ విషయంలో నాకు నేనుగా ఎంత సర్ది చెప్పుకున్నా తన మనస్సు వినడం లేదని.. ఆమె చేసిన మోసమే పదేపదే గుర్తుకు వస్తోందని లెటర్ లో రాశాడు.
ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే ఆ పెయిన్ భరించలేమని పేర్కొన్నాడు. జీవితం మీద విరక్తి పుట్టిందని అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు సలాం. పెళ్ళైన లెక్చరర్ తో సంబంధం పెట్టుకొని న్యూడ్ వీడియో కాల్స్ చేసి మాట్లేడదని తెలిపాడు.
అబ్బాయిలు మోసం చేస్తే పిచ్చపిచ్చగా హైలెట్ చేసి చూపిస్తారు. కాని అమ్మాయి మోసం చేస్తే ఎందుకు హైలెట్ చేయరని సూసైడ్ లెటర్ లో రాశాడు. తనలాంటి అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ సలామ్ లేఖలో కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.