అసెంబ్లీలో తమపై దాడి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ సభ్యుడే ఒకరు తన చేతికి గాయం చేశారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మీడియా ముందు చెప్పారు. నిజంగా టీడీపీ నేతలే దాడికి పాల్పడితే ఆ పార్టీని బ్లేం చేసేందుకు ఇదొక అవకాశంగా ఉపయోగించుకుంటుంది వైసీపీ. అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై టీడీపీ సభ్యులు దాడులకు దిగారని ఆ వీడియోలను సర్క్యూలేట్ చేసేది. కానీ ఇంతవరకు ఒక్క వీడియోను కూడా బయటపెట్టలేదు.
దాడి ఘటన జరగడానికి ముందు వ్యూహాత్మకంగా కెమెరాలను సభ్యుల వైపు మళ్ళించారు. నిద్రపోతున్న సభ్యులను కూడా చూపించారు కానీ పోడియం దగ్గర ఏం జరుగుతుందో మాత్రం చూపించలేదు. అసెంబ్లీలో ఏ మూలన ఏం జరుగుతుందో మినిట్ టూ మినిట్ రికార్డ్ అవుతుంది. ఈవాళ జరిగిన సంఘటన కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియో పుటేజ్ ను బయటకు తీస్తే ఎవరు ఎవరిపై దాడి చేశారో తెలుస్తుంది. టీడీపీ నేతలే తమపై దాడి చేశారని చెబుతున్న వైసీపీ… ఆ వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదన్నది అందరి నోట వినిపిస్తోన్న ప్రశ్న.
వైసీపీ నేతలు తలుచుకుంటే ఈ ఘటనకు సంబంధించిన వీడియో పుటేజ్ ను ఒక్క క్షణంలో బయటకు తీసుకురాగలరు. కానీ ఆ వీడియోను బయట పెట్టడానికి వైసీపీ ఎందుకు ఆసక్తి చూపడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. టీడీపీ నేతలే వైసీపీ సభ్యులపై దాడి చేస్తే..దీనిని అడ్వాంటేజ్ గా తీసుకునేది వైసీపీ. పైగా.. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో నిరుత్సహంలోనున్న వైసీపీ.. ఈ వీడియోలను పబ్లిక్ లోకి వదిలేసి ఓ రేంజ్ లో సానుభూతి పొందేది.
టీడీపీ అసెంబ్లీలోనూ రౌడీ రాజకీయాలు చేస్తోందని… నమ్మకం కుదరకపోతే ఇదిగో వీడియోలు చూడండి అంటూ ఆ వీడియోలను ఎల్లో మీడియా ప్రదర్శించేది. కానీ దాడి చేశారని చెబుతున్న వీడియోలను చూద్దామంటే ఒక్క వీడియో కనిపించడం లేదు. దీంతో వైసీపీ నేతలే టీడీపీ నేతలపై దాడి చేసి రివర్స్ లో మాట్లాడుతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.
Also Read : ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు