ఏపీ రాజకీయాల్లో సినీ గ్లామర్ ఎక్కువైపోతుంది. ముఖ్యంగా కమెడియన్స్ అధికార వైసీపీకి , జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు. అలీ వైసీపీలో ఉండగా.. 30ఇయర్స్ పృధ్వీ గతేడాది వైసీపీని వీడి జనసేనలో చేరారు. హైపర్ ఆది కూడా జనసేనకు ప్రధాన మద్దతుదారుడిగా ఉన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన నిర్వహించిన యువశక్తి సభలో హైపర్ ఆది పాల్గొన్నారు.
ఈ సభలో హైపర్ ఆది వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని చెలరేగిపోయారు. రోజాపై కూడా కౌంటర్లు వేశారు. జబర్దస్త్ లో చాలాకాలంపాటు జడ్జిగా వ్యవహరించిన రోజాతో ఆదికి మంచి సాన్నిహిత్యం ఉంది. అయినప్పటికీ ఆ సాన్నిహిత్యాన్ని కూడా కాదనుకొని రోజాపై సెటైర్లు వేశారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులను మెప్పించింది.
అయితే.. హైపర్ ఆది వైసీపీ నేతలపై సెటైర్లు వేసిన వీడియోస్ సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆదికి కౌంటర్ ఇచ్చేలా జబర్దస్త్ కమెడియన్స్ పై వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఇందులో బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్ కూడా ఉన్నారు.
హైపర్ అది, సుడిగాలి సుధీర్ మంచి స్నేహితులు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కు సుడిగాలి సుధీర్ వీరాభిమాని. ఈ విషయాన్ని ఎన్నోసార్లు బయటపెట్టారు. అలాంటి సుధీర్ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడే నేతలతో చేతులు కలుపుతాడా అన్నదిప్రశ్న.
రాజకీయాలు వేరు, సినిమా వేర్వేరని సుధీర్ చెప్పించి… రోజాపై ఆది చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నట్లు సుధీర్ తో ఓ ప్రకటన విడుదల చేయించేలా రోజా ఒత్తిడి చేస్తున్నారని వినికిడి. వాయిస్ తగ్గించుకొని మాట్లాడాలని..రోజాపై వాయిస్ రైస్ చేస్తే తాము ఊరుకోమంటూ సుధీర్ తో ఆదికి కౌంటర్ ఇప్పించాలని ట్రై చేస్తున్నారట. అదే సమయంలో… హైపర్ ఆదిపై సుధీర్ ను బరిలో నిలుపుతారని అంటున్నారు.
Also Read : వచ్చే ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ ఖాయం – ఎక్కడి నుంచంటే..?