వైసీపీలో జగన్ తరువాత అంత సజ్జల రామకృష్ణానే. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలో ఎప్పుడు ఏం చేయాలి..? ఎవరిని దూరం పెట్టాలి..? ఎవరికి గాలం వేసి గుంజాలి..? అనే విషయంలో సజ్జల సూచనలను జగన్ అమలు చేస్తారన్న ప్రచారం ఉండనే ఉంది. అయితే…ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఓటమికి కారణం సజ్జల గైడ్ లైన్స్ మాత్రమేనని ఇందులో జగన్ కు ఎంత మాత్రం ఓటమిని ఆపాదించవద్దునని మీడియాలో కథనాలు వస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సజ్జల వలెనే జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకొకున్నారని అది పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైందని వైసీపీ అనుకూల మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి.
జగన్ దగ్గరకు ఎమ్మెల్యేలు వెళ్ళాలంటే ముందు సజ్జల పర్మిషన్ తీసుకోవాలని.. దాంతోనే జగన్ కు ఎమ్మెల్యేలతో గ్యాప్ ఏర్పడిందని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో జగన్ చరిష్మా మసకబరాకుండా ఉండేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఓటమికి సజ్జలే కారణమని.. ఎన్నికల్లో జగన్ ఫోకస్ చేసి ఉంటె పరిస్థితి మరోలా ఉండేదనే ప్రచారాన్ని ఉదృతంగా చేస్తున్నారు. ఇప్పుడే సజ్జలపై వ్యతిరేక ప్రచారం స్టార్ట్ చేశారు. సస్పెన్షన్ వేటుకు గురైన ఎమ్మెల్యేలు కూడా ఇదే రకంగా మాట్లాడుతుండటంతో సజ్జలను బలిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ కూడా సజ్జలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుంది. తనే సీఎం అనే స్థాయిలో రాజకీయాలు చేస్తుంటారని ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. సోషల్ మీడియాను తన చెప్పు చేతుల్లోకి తీసుకొని తన వ్యతిరేకులపైన తప్పుడు ప్రచారం చేయిస్తుంటారని సజ్జలపై ఆరోపణ ఉంది. పార్టీకి జగన్ తరువాత తనే బాస్ అనే తరహలో సజ్జల వ్యవహరిస్తున్నారు. కానీ సజ్జల ఇన్నాళ్ళు జగన్ అండ చూసుకొని విర్రవీగారు కాని సమయం వస్తే సజ్జలను కూడా సైడ్ చేసేందుకు జగన్ వెనుకాడరని అంటున్నారు. అందుకు సమయం వచ్చిందని చెబుతున్నారు.
తనపైనున్న ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి జగన్ ఏయే మార్గాలు ఉన్నాయని పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు సజ్జల తగిలారు. అంత ఆయన వల్లే అని చెప్పి తప్పించుకోవాలని ట్రై చేస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఆయన పోస్ట్ ఊడుతుందని… ఆ తరువాత ఆయన పరిస్థితి ఏంటో అని వైసీపీలో చర్చ జరుగుతోంది. పార్టీలో నెంబర్ టు పొజిషన్‌లో జగన్ ఎవర్నీ ఎక్కువ కాలం ఉంచేందుకు ఆసక్తి చూపరు. మొదట వైవీ సుబ్బారెడ్డి తర్వాత ఉమ్మారెడ్డి, మైసూరారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలావరుసగా సీరిస్ కొనసాగుతుంది. ఇప్పుడు సజ్జలను బలి చేయాల్సిన సమయం వచ్చిందని వైసీపీలోనే గట్టిగా ప్రచారం జరుగుతోంది.