వైసీపీ సన్నిహితంగా మెదిలే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునను రాజకీయాల్లోకి తీసుకురావాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. మొన్నటిదాకా ఆయనను విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో నిలుపుతారని ప్రచారం జరిగింది. కాని, మారుతున్న రాజకీయ పరిణామాలతో నాగార్జునను పెద్దల సభకు పంపాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది మార్చిలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఏపీ నుంచి రెండు స్థానాలు ఖాళీ అవుతాయి. అందులో ఒకటి నాగర్జునకు ఇచ్చే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. ఓ రాజ్యసభ స్థానం టాలీవుడ్ లో నుంచి ఒకరికి ఇవ్వాలని వైసీపీ ముందే ప్లాన్ చేసుకుంది. అలీకి ఇవ్వాలని ముందు అనుకున్నారు కాని ఆయనకు కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో… ఇప్పుడు ఆ రాజ్యసభ సీటును నాగార్జునకు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో వైసీపీ హైకమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు.
నాగార్జునను రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుంది..? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారట వైసీపీ నేతలు. పైగా వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో.. నాగార్జునను రాజ్యసభకు పంపిస్తే అనేక విధాలా పార్టీకి కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగార్జునకు యూత్ లో , మహిళలలో మంచి ఆదరణ ఉంది. కాబట్టి ఆయన్ను రాజ్యసభకు పంపి.. పార్టీకి ఎన్నికల్లో ప్రచారం చేసేలా ఒప్పించుకోవాలని వైసీపీ అప్పుడే వ్యూహం రచిస్తోందని అంటున్నారు.
నాగార్జునకు రాజ్యసభ ఇవ్వడం వలన.. టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోల నుంచి మద్దతు పొందొచ్చు అనేది వైసీపీ ప్లాన్. చిత్ర పరిశ్రమలో చాలామంది వైసీపీపై ఆగ్రహంగా ఉన్నారు. వీరందరి నోరు మూయించాలంటే నాగార్జునకు రాజ్యసభ ఇస్తే సైలెంట్ అవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే కమ్మ సామజిక వర్గాన్నికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించినట్లు కూడా అవుతుందని భావిస్తున్నారు. అన్నీ అనుకునట్లుగా జరిగితే అక్కినేని నాగార్జునను రాజ్యసభలో ఎంపీగా అడుగుపెడతారు అని అంటున్నారు.
Also Read : కాంగ్రెస్ పార్టీలో చేరిన టాలీవుడ్ హీరో